Guppedantha Manasu 7 July Today Episode : వసుధార రోజా పువ్వులతో హార్ట్ సింబల్ వేస్తుంది అది అలాగే ఉంచి వెనక్కి తిరిగి చూస్తే రిషి వుంటాడు నేనేం నీకోసం రాలేదు కాఫీ తాగడానికి వచ్చాను అంటూ, వసుధార కూర్చొని రోజా పువ్వులతో చేసిన చైర్ లోనే తను కూడా కూర్చుంటాడు ఆ హార్ట్ సింబల్ ఎక్కడ రిషి చుస్తాడో అని అంత చిందరవందరంగా చేస్తుంది వసుధార, రిషి అక్కడే కూర్చుని సేమ్ టు సేమ్ వసుధార లాగానే అదేరోజా పువ్వులతో హాట్ సింబల్ వేస్తాడు, వసుధార చూసి షాక్ అయ్యి సార్ నేను ఈ హాట్ ని ఫోటో తీసుకోవచ్చా అని వసుధార అడుగుతుంది. దానికి రిషి కి కోపం వచ్చి నా హాట్ ని ముక్కలు చేసి దీన్ని ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతుంది చూడు అని ఆ హార్ట్ సింబల్ ను చెరిపేస్తాడు.
వసుధార కాఫీ తేవడానికి లోపలికి వెళుతుంది కాఫీ తీసుకుని వచ్చేసరికి సాక్షి వచ్చి రిషితో కూర్చుంటుంది. సార్ కాఫీ అని వసుధార రిషి కి కాఫీ ఇస్తుంది. చేసినవి అన్నీ చేసి సారీ చెబుతున్నావు అదేంటి తప్పును చేసి సారీ చెబితే సరిపోతుందా అని సాక్షితో అంటాడు రిషి. అప్పుడు వసుధార నన్నే అంటున్నాడేమో రిషి సార్ అని అనుకుంటుంది ఇంతలో సాక్షి హలో వసుధార అని పలకరిస్తుంది. హలో మేడమ్ అని వసుధార అంటుంది మేడం ఆ అని సాక్షి అనగానె, నాకు మీరు ఇప్పుడు ఈ రెస్టారెంట్ కస్టమర్ మిమ్మల్ని మేడమ్ అని పిలవడం నా డ్యూటీ అని అంటుంది వసుధార.
టేబుల్ పై ఉన్న రోస్ పువ్వులను ఏంటి ఈ చెత్త అంతా అని వాటిని కిందికి పడేస్తుంది సాక్షి, రిషి సాక్షి కోసం ఇంకో కాఫీ ఆర్డర్ చేస్తాడు, తర్వాత రిషితో సాక్షి ఏంటి ఈరోజు ప్లాన్స్ అని అడుగుతుంది, మనం సినిమాకి వెళ్దాం అని సాక్షి రిషితో అంటుంది. వసుధార వాళ్ళు మాట్లాడుకునేది అన్నీ వింటూ ఉంటుంది సాక్షి కావాలనే రిషి తో రిక్వెస్ట్గా రిషి మనం సినిమాకి వెళ్దాం అని అంటుంది. కాఫీ తీసుకో సాక్షి బాగుంటుంది అని కాఫీ సాక్షికి ఇస్తాడు రిషి , సాక్షి మనసు లో నువ్వు కాఫీ కోసం వస్తున్నావో వసుధార కొసం వస్తున్నావో ఎవరికి తెలుసు రిషి నీతోటి తిరగడంకోసం నా కారు కూడా తీసుకొని రాలేదు నీతో ఎలాగైనా సినిమాకి వెళ్తాను అని మనసులో అనుకుంటుంది సాక్షి.
Guppedantha Manasu 7 July Today Episode : రిషి, సాక్షి సినిమాకు వెళ్లకుండా వసుధార ఆపగలదా
సాక్షిని చూసి ఏంటి ఆలోచిస్తున్నావు అని రిషి అడిగితే నీది ఎంత మంచి మనసు రిషి సినిమాకి రావడానికి ఒప్పుకున్నావు అని అంటుంది రిషితో, రిషి ఏమో గౌతమ్ కోసం ఎదురుచూస్తూ వుంటాడు సాక్షి గౌతమ్ రాకుండా ఎలాగైనా ఆపేయాలి అనుకుంటుంది ఇంతలో వసుధార రెస్టారెంట్ బయటికి వచ్చి కారు టైరులో గాలి ని తీసేస్తుంది, సినిమాకి వెళతారా ఎలా వెళ్తారు ఇప్పుడు నేను చూస్తా అని అనుకుంటుంది వసుధార, గౌతమ్ ఇంట్లో నుండి బయలుదేరుతుంటే గౌతమ్ ని ఆపేయడానికి దేవయాని ఒక హెల్ప్ కావాలి గౌతమ్ నాకోసం నువ్వు చెయ్యి అని పని చెప్తుంది. పెద్దమ్మ రిషి రాకపోతే తిడతాడు నేను వెళ్తా అని గౌతమ్ దేవయానితో అంటాడు పెద్దమ్మ మాటకి విలువ లేదా అని చెప్పి పోకుండా గౌతమిని ఆపేస్తుంది.
ఇకపోతే రిషి, సాక్షి రెస్టారెంట్ బయటికి వస్తారు రిషితో సినిమాకి వెళ్ళబోతున్నాను అని సాక్షి చాలా సంబరపడిపోతోంది వసుధార కూడా వచ్చి బాయ్ సార్ బాయ్ సాక్షి అని చెప్తుంది. గౌతమ్ ఇంకా రాలేదని రిషి అనుకుంటాడు. గౌతమ్ రాకపోతే ఈ సాక్షి తో సినిమాకి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తాడు. ఇంతలో దేవయాని వాయిస్ మెసేజ్ చేస్తుంది. గౌతమ్కి నేనే పని చెప్పాను తను రావట్లేదు నాన్నా అని దేవయాని చెపుతుంది. వసుధార వెంటనే సార్ మీ కారు టైర్లో గాలి లేనట్టుంది అని అంటోంది. పంచర్ అయ్యిందో కావాలనే ఎవరో చేశారో అని సాక్షి వసుధారని ని చూసి అంటోంది. నాకు అదే డౌట్ అని రిషి అంటాడు ఇప్పుడు ఎలా సార్ అని వసుధార అంటుంది.
బెలూన్లో గాలి ఊదుతాము కదా అలా ఊదుకుంటూ వెళ్దాం అని వెటకారంగా రిషి వసుధారతో అంటాడు. సాక్షి ఇక్కడ టైం వేస్ట్ ఎందుకు మనం క్యాబ్లో వెళదామంటోంది సాక్షి, సారీ సాక్షి గౌతమ్ కూడా రావట్లేదు వెళ్లె మూడు కూడా లేదు అని అంటాడు రిషి, ఇంతలో అక్కడికి మహేంద్ర, జగతి వస్తారు నువ్వేంటి ఇక్కడ అని మహేంద్ర అంటాడు కారు పంచర్ అయ్యింది డాడ్ మీరు సాక్షిని ఇంట్లో దింపెయ్యండి అని అంటాడు. ఇంతలో జరిగింది మొత్తం జగతికి చెప్తుంది వసుధార ఏంటి మేడమ్ ఒక్క సారి చెప్పగానే మీ కొడుకు సాక్షి తో సినిమాకి వెళతాడా అని అంటోంది అలా అయితే నేను ఎన్నిసార్లు సారీ చెప్పాను అని వసుధార అనగానే మా అబ్బాయి సాక్షి తో సినిమాకి వెళితే నీకేంటి అంటుంది జగతి.
అప్పుడు వసుధరా మీరు, మీ కొడుకు ఇద్దరూ మారిపోయారు మేడం అని అంటుంది. అసలు నీ బాధ ఏంటి అని అడుగుతుంది జగతి. ఏంటి మేడమ్ ఇలా అంటున్నారు ఇంతవరకు సార్ తో నేనే సినిమాకి వెళ్లలేదు సాక్షి తో కలిసి ఎలా వెళతాడు. సాక్షి తో కలిసి రెండున్నర గంటలు పక్కనే కూర్చుని పాప్ కార్న్ తింటూ నవ్వుతూ, తుళ్లుతూ ఉంటే అదంతా నేను కలర్ స్కోప్ లో ఊహించుకొంటూంటే నా కడుపు రగిలిపోతోందని నా పరిస్థితి ఎలా ఉంటుంది మేడం అని వసుధరా అంటోంది.అసలు మీ కొడుకు సినిమాకి ఎలా వెళ్తారు మేడం అని వసుధరా అంటోంది ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. దీనితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది.