Viral Video : రోడ్డు మీద అడుగు బయటపెట్టామంటే చాలు.. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం. అనుక్షణం భయపడుతూ జాగ్రత్తగా రోడ్డు మీద ప్రయాణించాలి. ఎటువైపు నుంచి మృత్యువు ముంచుకొస్తుందో చెప్పలేం. అదే విధి అంటే. రోడ్డు మీద రోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో రోజూ కొన్ని వేల యాక్సిడెంట్లకు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. ఆ వీడియోల్లో కొన్ని భయంకరంగా ఉంటాయి. అందులో ఒకటి ఈ వీడియో.

నిజానికి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయి. పెద్ద పెద్ద వాహనాల్లో వెళ్లేవాళ్లు అయితే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఆటోలు, బస్సులు, కార్లు లాంటి వాహనాలకు ప్రమాదాలు జరిగితే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుంది. సమయానికి క్షతగాత్రులను హాస్పిటల్ కు తీసుకెళ్తే ప్రాణాలతో బయటపడొచ్చు కానీ.. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లకపోతే.. సమయానికి ట్రీట్ మెంట్ జరగకపోతే ఏం చేస్తారు.. ప్రాణ నష్టం ఇంకా పెరుగుతుంది కదా.
Viral Video : హైవేపై ఆటోను ఢీకొట్టిన ట్రక్
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఆ వీడియోను చూసి నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. వామ్మో.. ఇలాంటి యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయా అని నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియో ప్రకారం.. ఓ ట్రక్ హైవే మీద వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దాన్ని ఢీకొట్టి అలాగే ముందుకు దాన్ని తీసుకెళ్లింది. రోడ్డు దాటి ఆటో పక్కన పడిపోయి మూడు నాలుగు పల్టీలు కొట్టింది. దీంతో ఆటోలో ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. ఆటోలో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. ఆటోను ఢీకొట్టగానే ట్రక్ డ్రైవర్ కిందికి దిగి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అక్కడ ఉన్న కొందరు స్థానికులు ఆటోలో ఉన్నవాళ్లను బయటికి తీసి వెంటనే ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనను చూసి నెటిజన్లు అయ్యో అంటూ కామెంట్లు చేస్తున్నారు.