Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి, అలవైకుంఠపురంలో వరస సినిమాలతో హిట్ కొట్టారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ క్రమంలో కొత్త హ్యాట్రిక్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలుసు. అయితే… ఇప్పుడు అల్లుకి సంబంధించిన మరో కొత్త న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బన్నీ, త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్లో కొద్ది రోజుల క్రితం వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
Allu Arjun : వీరిద్దరి ఖాతాలో మరో హిట్ గ్యారెంటీనా…
అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ క్రమంలో కొత్త సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది వాస్తవమే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. అయితే ప్రస్తుతం బన్నీ ఇప్పుడు ఫోకస్ మొత్తం సినిమా పైనే పెడుతున్నాడు. అయితే ఇప్పుడు బన్నీ పుష్ప2 తర్వాత ఏ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నటిస్తున్నాడు అంటే పెద్దగా ఎలాంటి అప్డేట్స్ లేవు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పుష్ప2 తర్వాత ఫుల్ లెంగ్త ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని బన్నీ అనుకుంటున్నాడట. అందుకే త్రివిక్రమ్ పేరు రిజిస్టర్ లోకి వచ్చిందని చెబుతున్నారు. బన్నీకి వరస ప్లాపుల తరువాత అలవైకుంఠపురంలో విజయాన్ని పొందారు..

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా కోసం బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సినిమా స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా. ఇంతవరకు ఎటువంటి పనులు మొదలవలేదు. త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో కాస్టింగ్, క్రూ విషయంలో నిర్ణయాలు జరుగుతున్నాయి. త్వరలో దీనిని ఫైనల్ చేసుకొని సినిమా స్టార్ట్ చేస్తారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యే సమయానికి అటు పుష్ప2 పూర్తి చేస్తారట అల్లు అర్జున్. మహేష్ బాబుతో సినిమా తర్వాత త్రివిక్రమ్ ,రామ్ చరణ్ సినిమా స్టార్ట్ అవ్వవచ్చు అని ఈమధ్య న్యూ క్రియేట్ అవుతుంది. కానీ ఇప్పుడు బన్నీ సినిమా చర్చనీయకంగా మారింది.
.