Iliyana : హీరోయిన్ ఇలియానా ‘ దేవదాసు ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ పోకిరి ‘ సినిమాలో నటించింది. దాంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే త్వరలోనే ఇలియానా పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ సోదరుడితో ప్రేమలో ఉందని పుకార్లు వస్తున్నాయి. దీంతో త్వరలోనే ఇలియానా పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి.ఇలియానా పెళ్లి చేసుకోబోయేది ప్రముఖ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడిని.
Iliyana : పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఇలియానా… వరుడు ఎవరంటే…

కత్రినా కైఫ్ సోదరుడు సెబాష్టియన్ లారెంట మిచైల్ తో ప్రేమలో ఉందని అందరికీ తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. అయితే వీరిద్దరి పెళ్లి వార్తలు రావడానికి గల కారణం సెభాష్టియన్ తో కలిసి ఇలియానా ప్రస్తుతం పెళ్లి షాపింగ్ చేస్తుందంట. అందుకే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇలియానా కూడా పెళ్లిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మరి ఇలియానా నిజంగానే పెళ్ళి చేసుకుంటుందో లేదో చూడాలి.

చాలా కాలం క్రితం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది ఇలియానా. హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఇలియానా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఎక్స్పోజింగ్ ఇస్తూ నెట్టింట హంగామా చేస్తూ ఉంటుంది. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. గతేడాది ఏప్రిల్ లో వచ్చిన ‘ ది బిగ్ బుల్ ‘ లో నటించింది. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో నటిస్తుంది ఇలియానా.