Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాక ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ అన్ని భాషలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బన్నీ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉండగా ఈ సినిమా పూర్తయిన తర్వాత ఈయన చేసే సినిమాలన్నీ పాన్ ఇండియాలోనే ఉండబోతున్నాయి. అలా ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ పోతున్నాడు స్టైలిష్ స్టార్. త్వరలోనే పుష్పటు షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పుష్ప మొదటి వర్షన్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సక్సెస్ వల్ల పుష్ప 2 మూవీపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. దీనికి కారణం బన్నీ మరియు సుకుమార్ చేసిన వెండితెర మాయాజాలమే.
Allu Arjun : థియేటర్లో ప్రేక్షకులకి ఇక పూనా కాలే….

త్వరలో షూటింగ్ స్టార్ట్ గా పోతున్న పుష్పటు గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తూ ఉంది. ఈ సినిమాలో పుష్పవంలో చేసిన నటీమణులను కొందరిని ఈ సినిమాలో అనేక పాత్రలో తీసుకుని ఆలోచనలో ఉన్నట్లుగా ఇంకా దీనికి సంబంధించిన పనులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ ప్రియమణి మరియు ఇంద్రజ కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో సాయి పల్లవి కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో బన్నీతో కలిసి మాస్ స్టెప్స్ తో ఓ పాట చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

అయితే ఈ సినిమాలో పూర్తి ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ స్టోరీ కావడంతో గిరిజన మహిళ పాత్రలో రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోయిందంట సాయి పల్లవి. పుష్ప వన్ మూవీలో ఊ అంటావా మావ అన్న పాట ఎంత ఫేమస్ అయ్యిందో అదే విధంగా సాయి పల్లవి తో చేసే పాట కూడా అంతే ఫేమస్ కాబోతుందంటూ అభిమానులు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి మరియు స్టైలిష్ స్టార్ కాంబో గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటూ సాయి పల్లవి తో డాన్స్ చేశారంటే థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతూ ఉంది.