Allu Arjun : ఎవరీ అమ్మాయి .. ?? అల్లు అర్జున్ అలాంటి మెసేజ్ ఎందుకు చేశాడు..??

Allu Arjun : ఈ ఫోటోలోని అమ్మాయికి అల్లు అర్జున్ మెసేజ్ చేశారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి నానా హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో కరోలినా షేక్స్ పేరిట ఓ ఎకౌంటు ఉంది. ఆమె చూడడానికి విదేశీ అమ్మాయి లాగే కనిపిస్తుంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని తెలుస్తుంది. ఆమె పెట్టే ఫోటోలకు నెటిజన్లు ఎప్పుడు ఫిదా అవుతుంటారు. చాలా క్యూట్ గా, ట్రెండీగా, మోడరన్ గా, హెయిర్ స్టైల్ బాగుంటుంది అంటూ నెటిజన్లు చెప్పుకొస్తూ ఉంటారు.

Advertisement

allu-arjun-message-that-girl-trending-news

Advertisement

ఆమెకి సోషల్ మీడియాలో దాదాపుగా 2 లక్షల 50 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతలా ఈమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. అయితే తాజాగా ఈ అమ్మాయికి మన బన్నీ మెసేజ్లు చేశాడని సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. ‘ మీ ఫోటోలు, పోస్ట్ లు చాలా క్యూట్ గా, ఫన్నీ గా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ ఇలానే ముందుకు వెళుతూ ఉండు ‘ అని అల్లు అర్జున్ మెసేజ్ పెట్టినట్లుగా ఉంది. అయితే ఈ అమ్మాయిని హీరో నవదీప్ కూడా ఫాలో చేస్తున్నట్లుగా ఉన్నారు. నెక్స్ట్ సినిమాలో ఏదైనా పాత్రకి సజెస్ట్ చేసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.

అమ్మ బాబోయ్... ఈ అమ్మాయికి అల్లు అర్జున్ మెసేజ్ చేశాడా... అసలు ఈమె బన్నీకి ఏమవుతుంది...!! - Telugu Journalist

అయితే అల్లు అర్జున్ చేసిన మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఈ మెసేజ్ బన్నీ చేశాడా లేక ఫేక్ అకౌంట్ నుంచి ఇలా క్రియేట్ చేసి పబ్లిసిటీ సంపాదించుకోవడం కోసం చూస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక బన్నీ అభిమానులు అయితే బన్నీకి మెసేజ్లు పెట్టే తీరిక ఉందా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఆగస్టులో విడుదల కానుంది.

Advertisement