Anchor Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీముఖి కూడా ఒకరు.బుల్లితెర ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ మొదట్లో పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.పలు సినిమాలలో నటించినప్పటికీ శ్రీముఖి పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.ఈ క్రమంలోనే బుల్లితెరపై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బుల్లితెర స్టార్ యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది.అంతేకాక తన మాట తీరుతో చలాకితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీముఖి బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకుంది.
ఇలా బుల్లితెరపై వచ్చినటువంటి పాపులారిటీ ద్వారా ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఈ కార్యక్రమంలో రన్నర్ గా బయటకు వచ్చిన శ్రీముఖి కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అనంతరం ఇండస్ట్రీకి వచ్చి వరుస అవకాశాలను అందుకుంటు బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏ ఛానల్లో చూసిన ఏ కార్యక్రమంలో చూసిన కచ్చితంగా శ్రీముఖి కనిపిస్తూ సందడి చేస్తుంది .ఇలా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. అయితే యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు పలకరిస్తూ ఉంటుంది.
అంతేకాక తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని వీడియో రూపంలో తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో శ్రీముఖి షేర్ చేసింది. అయితే దీనిలో భాగంగానే ఆమె తన కొత్త ఇంట్లో దీపావళి వేడుకలను జరుపుకున్నట్లుగా తెలియజేసింది. ఒకప్పుడు చాలా ఇరుకు గదుల్లో మేము ఉండే వాళ్ళం అని భావోద్వేగానికి లోనైంది. అయితే ఇంత కష్టపడుతూ నేడు ఈ స్థాయికి వచ్చి ఇంత పెద్ద ఇంట్లో దీపావళి జరుపుకుంటున్నాం అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగానే తన జీవితంలో తాను ఎదురుకున్న కష్టాల గురించి కొన్ని విషయాలను శ్రీముఖి చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram