Allu Arjun : అల్లు అర్జున్ మన తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. అల్లు అర్జున్ అల్లు అరవింద్ కొడుకు అయినప్పటికీ ఏ మాత్రం ఆ ఛాయలు కూడా కనిపించకుండా తనదైన స్టైల్లో నటించి తెలుగు ప్రజల దగ్గర ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్. అల్లు అరవింద్ కి తెలుగు ఇండస్ట్రీలో ఏ స్థానంలో అందరికీ తెలుసు. కానీ అల్లు అర్జున్ తన డెడికేషన్ తో తన హార్డ్ వర్క్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన సినిమాలు చూస్తే అర్థమవుతుంది తన డెడికేషన్ లెవెల్ ఏ రకంగా ఉంటాయో అనేది.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేసిన అల వైకుంఠపురం సినిమా సక్సెస్ తర్వాత, పోయిన ఏడాది చేసిన పుష్ప మూవీ ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా ఏంటో చూపించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా లెవల్లో వారి మోగిపోయింది. దీనికి కారణం అల్లు అర్జున్ నటన పట్ల తనకున్న డెడికేషన్ తాను చేసే పాత్ర పట్ల ఆయనకున్న అంకితభావం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆయన సినిమాల్లో చేసి పాత్రల్లో వేరియేషన్ ఆయన డ్యాన్స్ లో తనకున్న డెడికేషన్ చూస్తే చెప్పొచ్చు తను ఐకానిక్ స్టార్ గా ఎంతగా గుర్తింపు తెచ్చుకున్నాడో.
Allu Arjun : గూగుల్ లో కూడా ఐకానిక్ స్టార్ దే హవా.

అల్లు అర్జున్ ఇప్పుడు ఒక అరుదైన రికార్డు సాధించాడు గూగుల్ సెర్చ్ లో టాపు వందమంది ఏషియన్ లిస్టులో మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ దక్షిణాది నుంచి టాప్ లో నిలవడం జరిగింది. ఈ విషయాన్ని గూగుల్ వారు అధికారికంగా ప్రకటించారు. గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఆసియా ఖండంలో టాప్ 100 సర్చ్ చేసిన వారిలో ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ మన సౌత్ తరఫున టాప్ లో ఉండడం జరిగింది. అదేవిధంగా తర్వాత ప్లేస్ లో తమిళ సూపర్ స్టార్ విజయ్ టాప్ లో నిలవడం జరిగింది. అంతేకాక ఇక మన సౌత్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ టాప్ ప్లేస్ లో నిలిచింది. తర్వాత మన తెలుగు హీరోయిన్ హీరోలు మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ తదుపరి స్థానాలు దక్కించుకున్నారు. ఐకానిక్ స్టార్ ఈ ఫీట్ ని అందుకోవడం ద్వారా తెలుగువాళ్ళ తెలుగువాళ్ల సత్తా అన్ని దేశమంతటా చాటి చెప్పాడు.