Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇంకో జంట విడిపోనుందా..ఈ వార్తల్లో నిజం ఎంత.

Tollywood : ఇటీవల కాలంలో మన సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అలా జరిగిన వివాహాల లో కొన్ని జంటల బంధం ఎక్కువ రోజులు నిలిచి ఉండడం లేదు. ఎలా కలుస్తున్నారో అలాగే సింపుల్ గా విడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో సమంత నాగచైతన్య వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో ఎవరికీ తెలియదు వాళ్ళిద్దరి విడాకులు తీసుకున్న విషయం అభిమానులకి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కలవాలి అని అనుకుంటున్నారు వాళ్ళిద్దరు అభిమానులు. ఇలా కొన్ని జంటలు విడాకులు తీసుకొని సింగిల్ లైఫ్ బ్రతకాలని కోరుకుంటున్నారు.

ఇలా ఇంకొక జంట విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్న జంట హేమచంద్ర శ్రావణ భార్గవి వీరిద్దరూ మంచి ఫేమస్ సింగర్స్ అయితే సినిమాలకు డబ్బింగ్ కూడా చెబుతుంటారు. హేమచంద్ర, శ్రావణ భార్గవి వీళ్ళు ఇద్దరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా పుట్టింది. అలా వీళ్ళ జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది. ప్రస్తుతం ఏం జరిగిందో వీళ్లిద్దరి మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు. వారి బంధం విడాకులకు దారి పట్టింది అంటున్నారు నెటిజన్లు.

Tollywood : ఈ వార్తల్లో నిజం ఎంత.

will another couple divorce in the Telugu film industry
will another couple divorce in the Telugu film industry

ఇప్పుడు వీరిద్దరి విడాకుల విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విడాకుల విషయం మీద వార్తలు గట్టిగానే చర్చ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. హేమచంద్ర సోషల్ మీడియాలో చాలా హుషారుగా ఉంటాడు కానీ విడాకుల గురించి ఎన్నో కామెంట్స్ వచ్చినా గానీ ఎటువంటి రియాక్షన్ మాత్రం చంద్ర నుంచి రావడం లేదు అంటున్నారు నెటిజన్లు.ఇద్దరి విడాకులు నిజమే అని ప్రచారాలు జరుగుతున్నాయి. వారు ఇద్దరు గురించి ఎన్ని కామెంట్స్ రూపంలో ప్రశ్నలు వచ్చినా గాని సోషల్ మీడియాలో వాళ్లు మాత్రం దీనికి ఎటువంటి రెస్పాండ్ అవ్వడం లేదని వార్తలు వస్తున్నాయి. అందరికీ ఈ విషయం గురించి నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి మరి.