కోడలు పిల్లను ఎత్తుకొని తెగ మురిసిపోయిన బన్నీ

రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీ మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement

Advertisement

రామ్ చరణ్ తండ్రి కావడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. మరికొంతమంది అపోలో ఆసుపత్రికి వెళ్లి రామ్ చరణ్- ఉపాసన దంపతులను విష్ చేస్తూన్నారు.

ఈ క్రమంలోనే ఉపాసనతోపాటు బిడ్డను చూసేందుకు అల్లు అర్జున్ అపోలో ఆసుపత్రికి వెళ్ళారు. తన భార్య స్నేహరెడ్డితో కలిసి వెళ్ళిన బన్నీ.. రామ్ చరణ్ – ఉపాసనకు విషెస్ చెప్పి కోడలిని చూసి తెగ మురిసిపోయాడు. తన చేతుల్లోకి ఎత్తుకొని ముద్దాడాడు.

ప్రస్తుతం ఉపాసనతోపాటు బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. మెగా ఫ్యామిలీలోకి ఆడబిడ్డ రావడంతో చిరు ఫ్యామిలీ తెగ మురిసిపోతుంది.

Advertisement