ఆదిపురుష్ పై వివాదం – ప్రభాస్ పై మాధవిలత ఫైర్

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ప్రభాస్ గెటప్ కూడా అంతంతమాత్రమే ఉందని పెదవి విరుపులు వచ్చాయి. రామాయణాన్ని వ్యాపార ధోరణితో చూస్తారా..? అనే ప్రశ్నలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వివాదంపై టాలీవుడ్ హీరోయిన్ మాధవిలత స్పందించింది.

Advertisement

ఆదిపురుష్ సినిమాపై స్పందిస్తూ అందరూ డైరక్టర్ ను దొబ్బుతున్నారని.. ఇందులో ప్రభాస్ ది కూడా తప్పేనని వ్యాఖ్యానించింది. హీరోకు బాధ్యత లేదా…? అని ప్రశ్నించింది.ప్రభాస్ఇప్పుడు కొత్తగా సినిమాలు చేయడం లేదని, కథ విన్నప్పుడు , డైలాగ్ చెప్పేటప్పుడు ఈ సినిమా స్టొరీ గురించి తెలియదా..? అని ప్రశ్నించారు. డైరక్టర్ ఏదీ చెబితే అది చేస్తారా..? అయినా హీరో చెప్పిందే డైరక్టర్ చేస్తున్నాడు కదా అని చెప్పుకొచ్చింది.

Advertisement

 

ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తనను ఏమన్నా పరవాలేదు. ప్రభాస్ ది కూడా తప్పు ఉందని మాధవిలత వ్యాఖ్యానించింది. మాధవిలత పోస్ట్ వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాధవిలతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో జోలికి వస్తే సహించమని హెచ్చరిస్తున్నారు.

Advertisement