Allu Arjun: పుష్ప2 సినిమా ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుతున్నట్లు అందరికీ తెలిసిందే, పార్ట్ వన్ సినిమాలో పెండమిక్ కారణంగా షూటింగ్ తొందరగా ముగించి తెరకు ఎక్కిచరు. ఈ మూవీ షూట్లను అన్ని మన ఇండియాలోనే చేసినట్లు అందరికీ తెలిసిన విషయమే. అయినా కానీ ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో విజయం అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కొన్ని డైలాగులు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా లాస్ట్ లో బన్నీ, పహాద్ మధ్య వార్ డిక్లేర్ చేస్తూ పుష్ప మూవీ కి సీక్వెల్ పుష్ప ది రైస్ పై భారీగా అంచనాలు పెంచేశారు సుకుమార్ గారు.
అయితే పుష్ప2 కొన్ని మార్పులలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అడుగుపెట్టబోతున్నాడని చెప్తున్నారు. సినీ యూనిట్ వాళ్ళు మన అల్లు అర్జున్ పుష్పరాజ్ ను అతడి దూకుడును ఆపాలి అంటే ఈ స్టోరీకి అనుగుణంగా ఇంకొక విలన్ ఎంట్రీ అవసరం ఉన్నట్లు చెప్తున్నారు సుకుమార్. అయితే ఈ విలన్ పాత్రలో విజయ్ సేతుపతిని దింపుతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. విజయ్ సేతుపతి విలన్ గా చాలా సినిమాలలో నటించి అందరి ఆదరణ పొందాడు. విలన్ గా తను మంచి క్రేజీను సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సుకుమార్ గారు ఈ క్యారెక్టర్ ను హైలైట్ చేయాలి అని ప్లాన్ లో ఉన్నాడు.
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప2 లో తలపడనుంది విజయ్ సేతుపతి తోనేనా.

ఇలా కొన్ని మార్పుల చేర్పులతో పుష్ప2 మన ముందుకి రాబోతున్నట్లు సినీ పరిశ్రమ లో వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా ఒక రేంజ్ లో ఉండబోతున్నట్లు సుకుమార్ గారు చెప్తున్నాడు. దీని కథ అంతా రెడీ అయినట్లు చెప్తున్నారు. ఈ సినిమా అంటే నేను కాదు పుష్ప2 అంటే అల్లు అర్జున్ అంటున్నారు సుకుమార్ గారు. పుష్ప2 చిత్రం ఇప్పటికే సగం షూట్ జరిగినట్లు టాక్ అయితే ఈ సినిమా ముగింపు కొద్దిగా లేట్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా షూట్లను మాత్రం మన ఇండియాలో కాకుండా ఇతర దేశాలలో తీస్తున్నట్లు సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకురావాలని ప్లాన్ లో ఉన్నారు. ఈ విధంగా గా మక్కల్ సెల్వం నీ పుష్ప2 లో బన్నీ కి విలన్ గా దించబోతున్నాడు మన సుకుమార్.