Pakka Commercial Review : సినిమా పేరు: పక్కా కమర్షియల్
నటీనటులు : గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్, సప్తగిరి తదితరులు
డైరెక్టర్ : మారుతి
నిర్మాత : బన్నీ వాసు
సినిమాటోగ్రఫీ : కర్మ్ చావ్లా
సంగీతం : జేక్స్ బిజోయ్
విడుదల తేదీ : జులై 1, 2022
పక్కా కమర్షియల్ అంటూ నిజంగానే కమర్షియల్ సినిమాను తీశాడు మారుతి. సినిమా పేరుకు తగ్గట్టుగానే ఇది పక్కా కమర్షియల్ సినిమానే. గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్, రావు రమేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. చాలా ఏళ్ల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కు ఈ సినిమా బూస్ట్ ఇవ్వాలని తన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. సీటీమార్ అంటూ వచ్చిన గోపీచంద్.. హిట్ కొట్టినప్పటికీ.. అది అంతగా బ్లాక్ బస్టర్ అవ్వలేదు. మరోవైపు మారుతి కూడా ప్రతిరోజు పండగే సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి.. అదే జోరుతో పక్కా కమర్షియల్ సినిమాను తీశాడు. మరి పక్కా కమర్షియల్ నిజంగానే కమర్షియల్ గా ఉందా.. సినిమా కథ ఏంటి.. గోపీచంద్, మారుతి కాంబో ప్రేక్షకులను ఆకట్టుకుందా తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

Pakka Commercial Review : సినిమా కథ ఏంటంటే?
ఈ సినిమాలో గోపీచంద్.. రామ్ చంద్ గా నటించాడు. హీరోయిన్ రాశీ ఖన్నా ఝాన్సీగా నటించింది. ఈ సినిమా మొత్తం కోర్టు, లాయర్ల చుట్టూనే తిరుగుతుంది. గోపీచంద్ ఒక లాయర్. తన తండ్రి సత్యరాజ్ జడ్జి. తను చాలా నిజాయితీపరుడు. సత్యరాజ్ ఎన్నో కేసులలో తీర్పు చెప్పి పేరు ప్రఖ్యాతలు గడిస్తాడు. కానీ.. రామ్ చంద్ మాత్రం పక్కా కమర్షియల్ అన్నమాట. కొన్నేళ్ల పాటు తన లాయర్ వృత్తిని వదిలేసి.. తర్వాత ఓ మిస్టరీ కేసు విషయంలో మళ్లీ నల్ల కోటు ధరిస్తాడు. మరోవైపు ఝాన్సీ సీరియల్ నటి. లాయర్ పాత్రలో నటించడం కోసం.. ఆ పాత్ర గురించి తెలుసుకోవడం కోసం రామ్ చంద్ దగ్గర జూనియర్ లాయర్ గా చేరుతుంది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. మరోవైపు ఓ కేసు విషయంలో రామ్ చంద్.. తన తండ్రితోనే పోటీ పడతాడు. తన తండ్రితో విభేదిస్తాడు. అసలు.. ఆ మిస్టరీ కేసు ఏంటి? తన తండ్రినే ఎందుకు విభేదిస్తాడు? అసలు ఝాన్సీ ఎవరు? వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర ఏంటి? రావు రమేశ్ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ
సినిమాను విశ్లేషించాలంటే ముందు సినిమా డైరెక్టర్ మారుతి గురించి మాట్లాడుకోవాలి. మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు కానీ.. తను ఏంటో.. తన సత్తా ఏంటో అందరికీ తెలుసు. తన సినిమాలు ఎంత విభిన్నంగా ఉంటాయో కూడా అందరికీ తెలుసు. మారుతీ మార్క్ ఈ సినిమాలోనూ ఉంటుంది. ఫన్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్ ధ్యేయంగా మారుతి సినిమాలు ఉంటాయి. ఇందులోనూ ఫన్ ఎలిమెంట్ కు కొదువ ఉండదు. అలాగే.. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది. ఇక.. గోపీచంద్ గురించి చెప్పుకోవాలంటే.. సినిమాను తన భుజాల మీద మోశాడు గోపీచంద్. కామెడీ పరంగా కావచ్చు.. ఎంటర్ టైన్ మెంట్ పరంగా కావచ్చు.. యాక్షన్ పరంగా కావచ్చు.. గోపీచంద్ అదరగొట్టేశాడు. హీరోయిన్ రాశీ ఖన్నా కూడా చాలా ఎనర్జిటిక్ గా నటించింది. సీరియల్ నటి పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలో క్లయిమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సినిమాకు అదే హైలెట్. మిగితా పాత్రల్లో నటించిన వాళ్లు కూడా తమ పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
కామెడీ
యాక్షన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
క్లయిమాక్స్
మైనస్ పాయింట్స్
సాంగ్స్
సెకండాఫ్
ఆర్టిఫిషియల్ కామెడీ
కన్ క్లూజన్
చివరగా ఒక్కమాట.. కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కాస్త యాక్షన్ కూడా కావాలి అనుకునే వాళ్లు పక్కా కమర్షియల్ సినిమాను ఏం చక్కా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగానే ఇది పక్కా కమర్షియల్.
యువతరం రేటింగ్ : 3.25/5