Allu Arjun : బన్నీ భార్య అంత మాట అన్నదా… కన్నీరు పెట్టుకున్న అల్లు అర్జున్…

Allu Arjun : టాలీవుడ్ లో ఎన్ని జంటలు ఉన్న అందరికీ ప్రత్యేకమైన జంట అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయిన సరే కుటుంబాలను ఒప్పించి వీరిద్దరూ పెళ్లిని గ్రాండ్ గా చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు. బన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే స్నేహ రెడ్డి బన్నీకి సంబంధించిన పనులను, పిల్లలను చూసుకుంటూ మంచి ఇల్లాలుగా మంచి మార్కులు సంపాదించుకుంటుంది. అయితే బన్నీ కెరీర్లో ‘ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ‘ అనే సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

Advertisement

కంటెంట్ సరిగా లేకపోవడం కావచ్చు, బన్నీని ఆర్మీ లుక్కులో చూడలేకపోవచ్చు, కారణాలు ఏవైనా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ తన భార్య స్నేహారెడ్డి గురించి చెప్పిన మాటలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ‘ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ‘ సినిమా చేసే టైంలో ఆర్మీ గురించి తెలుసుకొని ఆర్మీలో చేరిపోదామని బన్నీ డిసైడ్ అయ్యాడట. ఇదే విషయాన్ని బన్నీ భార్యకు చెప్పాడట. అప్పుడు స్నేహారెడ్డి ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెరీగుడ్, కమాన్ గో అంటూ చెప్పేసిందంట.

Advertisement

Allu Arjun : బన్నీ భార్య అంత మాట అన్నదా..

Allu sneha comments about Allu Arjun
Allu sneha comments about Allu Arjun

స్నేహ రెడ్డి మాటలకి బన్నీ షాక్ అయిపోయి నేను వెళ్ళిపోతే మరి నువ్వు ఏం చేస్తావు.. అక్కడ ఏదైనా జరగొచ్చు.. నేను చనిపోయిన చనిపోవచ్చు మరి నీకు ప్రాబ్లం కదా.. పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని అన్నాడట. దానికి బదులుగా ఆమె నో.. నాకు అలాంటి బాధలు లేవు. దేశం కోసమేగా చచ్చిపోతాను అంటున్నవ్ నాకు ప్రాబ్లం లేదు ఆర్మీకి వెళ్ళు పిల్లలను నేను చూసుకుంటాను, ధైర్యంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చిందంట. అప్పుడు అర్థమైంది బన్నీకి తన భార్యకు దేశం పట్ల ఎంత ప్రేమ ఉందో అనేది. అంతేకాదు ఆ ఒక్క మాటతో బన్నీ ఎమోషనల్ అయిపోయాడట. ఏ భార్య నిజానికి అలా చెప్పదు అంటూ కన్నీరు పెట్టుకున్నారట. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.

Advertisement