Ananaya Pnade : ప్రస్తుతం అనన్య పాండే చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ‘ లైగర్ ‘ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య పాండే సంచలన విషయాన్ని బయట పెట్టేసింది. ఇన్నాళ్లు సైలెంట్ గా సినీ ప్రమోషన్స్లో పాల్గొన్న అనన్య రీసెంట్గా సినిమా రిలీజ్ అయ్యే 24 గంటల ముందు ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయట పెట్టేసింది. దీంతో ఇప్పుడు అనన్య పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ డాటర్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అనన్య ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ లైగర్ ‘ సినిమాలో హీరోయిన్గా నటించింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో హాట్ బ్యూటీ అనన్య పాండే జోడి కడితే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
వీరిద్దరి జోడి అనగా సినిమాలో సీన్స్ అదిరిపోతాయి అనుకున్నారు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు లైగర్ పై సినీ ప్రియులు. కానీ సినిమా విడుదలయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటన పరంగా బాగున్న పూరి జగన్నాథ్ డైరెక్షన్ పరంగా మెప్పించలేకపోయాడు. ఈ సినిమా ఫ్లాఫ్ కావడానికి పూర్తి కారణం పూరీ పైన పడింది. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య పాండే మాట్లాడుతు కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుందాం. ఈ సినిమాలో అవకాశాలు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
Ananaya Pnade : సడన్ గా నన్ను దగ్గరకు లాగేసుకొని బుగ్గ కొరికాడు…
నాకు ఈ సినిమా మంచి లైఫ్ ఇస్తుందని కచ్చితంగా చెప్పగలను. సినిమా స్పెషల్ రోల్ లో నటించిన మైక్ టైసన్ గురించి చెప్పుకొస్తూ.. సినిమా షూటింగ్ టైంలో అందరూ మైక్ టైసన్ గారితో ఫోటో దిగుతున్నారు. నాకు ఫస్ట్ టైం ఆయనను చూడగానే భయమేసింది. దూరం దూరం గానే ఉన్నాను. కానీ అందరూ ఆయనతో ఫోటోలు దిగుతుంటే నాకు కూడా ఓ స్వీట్ మెమోరీలా ఉంటుంది అని ఆయన దగ్గరికి వెళ్లి ఫోటో తీసుకోవడానికి నిలుచున్నాను. దీంతో వెంటనే మైక్ టైసన్ గారు నన్ను గట్టిగా దగ్గరికి లాక్కొని వెంటనే టక్కున నా బుగ్గ కొరికేశాడు. దీంతో నేను షాక్ అయిపోయాను. కానీ ఆయన చాలా సరదా మనిషి అని, చాలా సరదాగా ఉంటారని తెలిసింది. ఆయనను కలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.