Anasuya Bharadwaj : ఒకానొక టైంలో యాంకర్స్ అంటే సాదాసీదాగా ఉంటూ ఏదో కనిపించామా అన్న విధంగా ఉండేవారు. ఎంత మోడ్రన్ గా కనిపించినా అందాల ప్రదర్శనలో చాలా లిమిట్స్ ఉండేవి. కానీ బుల్లితెరకు ఆ అందం తీసుకొచ్చింది మాత్రం అనసూయ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. యాంకరింగ్ అనే పదానికి గ్లామర్ ను జోడించిన వారిలో అనసూయ పేరు మొదటిగా చెప్పుకోవచ్చు. మొదట టీవీ 9 లో న్యూస్ రీడర్ గా పనిచేసిన ఈ అమ్మడు తర్వాత జబర్దస్త్ లో ఛాన్స్ కొట్టేసింది. మొదట టీవీ9 లోని చాన్స్ రావడం కోసం చాలా రోజులు కష్టపడింది అనసూయ. జబర్దస్త్ లో ఈమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత యాంకర్ అనే పదానికి ఓ గుర్తింపు తెచ్చింది ఈ అందాల భామ.
జబర్దస్త్ కి వచ్చినప్పుడు డ్యాన్స్ తో అధరకొడుతు కామెడీ షో లో ఈమె కేజ్ ను పెంచుకుంటూ వచ్చింది. మెల్ల మెల్లగా ఈటీవీ ప్రేక్షకులను తన అందంతో తన వైపు తిప్పుకునేలా చేసింది. కామెడీ స్కిట్ల మధ్యలో తనదైన స్టైల్ లో రొమాంటిక్ పంచులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. దానితో అనసూయ పాపులారిటి ఇంకా పెరిగిపోయింది. యూత్ లో ఈ అమ్మడికి క్రేజ్ పీక్స్ కి చేరుకుంది. తర్వాత అనసూయకు క్షణం అనే సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తరువాత అనసూయ రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన రంగమ్మత్త పాత్రతో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తు వేసుకుంది.
Anasuya Bharadwaj : అనసూయ కాస్టింగ్ కౌచ్ పై సెన్సేషనల్ కామెంట్స్….
రీసెంట్ గా పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో విలక్షణ నటనతో ఆకట్టుకోగలిగింది. అయితే అనసూయ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై స్పందించి వార్తలలో నిలిచింది. సినిమాలలో ఆఫర్ ఇస్తానని పిలిచి అడగకూడనివి ఏవైనా అడిగితే ఆ సినిమాని వదులుకోవడానికి సైతం తాను వెనకాడనని ఆ పాత్ర కాకపోతే దాని అమ్మలాంటి పాత్రలు దొరుకుతాయని అంటూ వైరల్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ ధైర్యం లేకనే చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీలో అన్యాయానికి గురవుతున్నారు అంటూ తెలియజేసింది. కచ్చితంగా ఇలాంటి ధైర్యం సినిమాలలో పనిచేసే ప్రతి అమ్మాయికి ఉండాలని తెలియజేసింది అనసూయ భరద్వాజ్.