Viral Video : వేల పాములను పట్టాడు.. చివరకు కోబ్రా కాటుతో కన్నుమూశాడు

Viral Video : కొన్ని వేల పాములను తన చేతులతో పట్టాడు. అడవుల్లో వదిలేశాడు. ఎన్నో విషపూరితమైన పాములను కూడా పట్టాడు. కానీ.. ఏనాడూ ఆ పాముల కాటుకు గురి కాలేదు. ఎంతో ఒడుపుతో, ఎంతో జాగ్రత్తగా పాములను పట్టడంలో ఆయన నేర్పరి. అలా కొన్ని వేల పాములను పట్టిన ఘనత ఆయనది. కానీ.. చివరకు ఓ కోబ్రా కాటుతో కన్నుమూశాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని చురు అనే జిల్లాలో చోటు చేసుకుంది.

Advertisement
snake man died after bitten by snake in rajasthan
snake man died after bitten by snake in rajasthan

ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వినోద్ తివారీ అనే వ్యక్తి ఓ షాపు ముందు కోబ్రాను పడుతుండగా అతడి చేయిపై నాగుపాము కాటేసింది. దాన్ని పట్టిన తర్వాత బ్యాగులో వేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతడి వయసు 45 ఏళ్లు. అతడిని రాజస్థాన్ లో అందరూ ముద్దుగా స్నేక్ మ్యాన్ అని పిలుస్తుంటారు.

Advertisement

Viral Video : స్నేక్ మ్యాన్ మృతితో మూగబోయిన చురు ప్రాంతం

చురు జిల్లానే కాదు.. పాములు ఉన్నాయంటే ఎంత దూరం అయినా వెళ్లి పాములను జాగ్రత్తగా, ఎటువంటి హాని కలగనీయకుండా పట్టుకొని వాటిని అడవుల్లో వదులుతుంటాడు. అవి ఎంత విషపూరితమైన పాములు అయినా సరే. వాటిని చాలా జాగ్రత్తగా పడుతాడు వినోద్. కానీ.. తాజాగా ఓ షాపు బయట కోబ్రాను పట్టాడు. ఆ తర్వాత దాన్ని బ్యాగులో వేయబోతుండగా ఒక్కసారిగా అది అతడి చేయిపై కాటేసింది. దీంతో అక్కడే కూర్చొన్న వినోద్.. అది కాటేసిన పది నిమిషాలకే అక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయ్యో.. ఎంత పని అయింది అని బాధపడుతున్నారు. చురు జిల్లా ప్రజలు కూడా స్నేక్ మ్యాన్ మృతితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement