Anasuya : న్యూస్ రీడర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అనసూయ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె బుల్లితెరపై ఎంతలా ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ ఈ షోలో తనదైన అందాల ప్రదర్శనతో షోకే హైలైట్ గా నిలుస్తుంది. జబర్దస్త్ కాకుండా ఆమె చేసే అన్ని టీవీ షోస్ లో తనదైన ముద్ర వేస్తూ అందాలు ఆరబోస్తూ ఆ ప్రోగ్రాం కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే సరిగమప సూపర్ సింగర్ జూనియర్ షోలో తన అందాలతో ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది ఈ భామ.
అనసూయ చేతినిండా ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది అయితే తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఒక సినిమాలో అనసూయ ఒ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఇంతకుముందే పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం. సెకండ్ హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ కూడా ఈ సినిమాలో చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తలే కనుక నిజమైతే అనసూయ జాక్పాట్ కొట్టిందని చెప్పాలి. మహేష్ బాబు సినిమాలో అనసూయ ఓ ఫన్నీ పాత్రలో చేస్తుంది అని మూవీ వర్గాలు చెప్తున్నాయి.
Anasuya : అమ్మడుకి బంపర్ ఆఫర్.

ఈ అమ్మడు మహేష్ బాబుకి వదిన పాత్రలో చేస్తూ వీరిద్దరి మధ్య కామెడీ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని మూవీ వర్గాల వారు తెలియజేస్తున్నారు. ఇప్పటికే అనసూయ స్టార్ హీరోలతో చేసి ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉంది. ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తూ ఈ ఆఫర్ ని కొట్టేయడంతో ఈ అమ్మడు బూరెలు బుట్టలో పడినట్లే అంటున్నారు మూవీ విశ్లేషకులు. అనసూయ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసుపోకుండా తన అందంతో తెలుగు ప్రేక్షకుల ను ఆకర్షిస్తూ హీరోయిన్లకు సైతం గట్టి పోటీని ఇస్తుంది.