Naga Chaitanya : అక్కినేని వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య. జోష్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఆ సినిమా ప్లాఫ్ అయినప్పటికీ.. తన రెండో మూవీ ఏ మాయ చేశావేతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. అంతే కాదు.. ఆ సినిమాతో మనోడి కెరీరే మారిపోయింది. వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంతతో కొన్నేళ్లు ప్రేమ వ్యవహారం నడిపించి చివరకు ఇద్దరూ పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు.

ఏ మాయ చేశావే తర్వాత.. నాగ చైతన్య చాలా సినిమాల్లో నటించాడు. కానీ మధ్యలో కొన్ని సినిమాలు నాగ చైతన్యకు అంతగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత లవ్ స్టోరీ, బంగార్రాజు సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం నాగచైతన్య ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 22 న రిలీజ్ కానుంది.
Naga Chaitanya : నాగ చైతన్య సమస్యను పబ్లిక్ గా చెప్పేసిన రాశీ ఖన్నా
తన తాజా సినిమా ప్రమోషన్స్ లో నాగ చైతన్య, హీరోయిన్ రాశీ ఖన్నా బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ మధ్య 5 సెకండ్ గేమ్ అంటూ మూవీ ప్రమోషన్స్ కోసం ఓ వీడియోను రిలీజ్ చేశాడు దిల్ రాజు.
అయితే.. తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య గురించి రాశీ ఖన్నా కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసింది. చైతూ వద్ద ఉన్న కార్ల విషయం.. ఇంకా తనకు ఉన్న సమస్య గురించి కూడా చెప్పేసింది రాశీ ఖన్నా. నాగ చైతన్య వద్ద ఖరీదైన కార్లు ఉన్నాయట. వాళ్లిద్దరు కలిసినప్పుడు ఎప్పుడూ వాళ్లు చేసిన సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటారట. అలాగే.. నాగ చైతన్యకు సైట్ ఉందని అందుకే అతడు అద్దాలు వాడుతున్నాడని చెప్పుకొచ్చింది రాశీ.
చాలామంది అతడు స్టయిల్ కోసం సినిమాల్లో, బయట అద్దాలు పెడుతాడని అనుకుంటారు కానీ.. అతడికి సైట్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. తాజాగా రాశీ ఖన్నా అసలు నిజాన్ని బయటపెట్టేయడంతో చైతూ అభిమానులు షాక్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.