బుల్లితెర యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా లైం లైట్ లోకి వచ్చిన ఆ అందాల యాంకర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. చేతిలో బోలెడు సినిమాలు ఉండటంతో బిజీ, బిజీగా గడుపుతోంది.
ఇటీవల షూటింగ్ కు కాస్త విరామం లభించడంతో తన భర్తతో మాల్దీవ్స్ వెళ్ళింది అనసూయ. అక్కడ బికినీలో దిగిన ఫోటోలను, తన భర్తను కిస్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. భర్తను కిస్ చేసే ఫోటోలను ఇలా పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో ఎలా పెడుతారని ప్రశ్నించారు నెటిజన్స్. దీనిపై ట్విట్టర్ వేదికపై అనసూయ ఫైర్ అయింది.
కాగా ఆమె లేటెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ అయిపోయిన తరువాత దిగిన ఫోటోను తన ఇన్స్టా స్టొరీలో షేర్ చేసింది. అర్దరాత్రి రెండు గంటలకు మొదలైన షూటింగ్ తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగింది. దీంతో అనసూయ రాత్రంతా నాన్ స్టాప్ గా అదే పని చేసి అలసిపోయినట్లు , నీరసంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది.
Also Read : నైట్ నిద్రలేకున్నా పొద్దున్నే అది మాత్రం చేయాలనుంటుంది – తమన్నా పర్సనల్ మేటర్ లీక్