నటుడు విజయ్ వర్మతో రిలేషన్ ను ఎట్టకేలకు అంగీకరించింది మిల్క్ బ్యూటీ తమన్నా. లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో పాల్గొన్న తమన్నా..ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గతంలో విజయ్ వర్మతో రిలేషన్ ను కొట్టిపారేసిన తమన్నా తాజాగా బయటపెట్టడంతో వీరు త్వరలోనే పెళ్లిచేసుకుంటారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .
అవును. విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నాను. అయితే తాను నటుడని మాత్రమే ప్రేమించలేదు. తనను బాగా చూసుకుంటాడు. కేరింగ్ పర్సన్. తనను బాగా చూసుకుంటాడనే నమ్మకం కుదిరాకే తనతో రిలేషన్ మెయింటేన్ చేస్తున్నానని తమన్నా వివరించింది. ఇక విజయ్ వర్మ మాట్లాడుతూ..పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవద్దనే ప్రేక్షకులకు తమన్నాతో రిలేషన్ విషయం చెప్పలేదని..కెరీర్ కు సంబంధించిన విషయాలను మాత్రమే షేర్ చేసుకోవాలనుకున్నానని చెప్పారు.
ఇక తమన్నా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు విజయ్ వర్మ. రాత్రి ఎంత లేటై పడుకున్నా ఉదయం మాత్రం వ్యాయామం చేయాలనీ పట్టుబడుతుంది. రాత్రంతా మేల్కొని ఉన్నా ఉదయం వర్క్ అవుట్ ను అస్సలు స్కిప్ చేయదని చెప్పుకొచ్చాడు. వ్యాయామం మీద ఎక్కవగా ఫోకస్ చేస్తుందని తమన్నా గురించి చెప్పాడు విజయ్ వర్మ. తాను మాత్రం వ్యాయామం గురించి ఆసక్తి చూపాడట.
లస్ట్ స్టోరీస్ 2 చిత్రీకరణ సమయంలో తమన్నా-విజయ్ వర్మ దగ్గరయ్యారట. ఈ సీరిస్ లో వీరిద్దరి మధ్య బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇక, జూన్ 29 నుండి లస్ట్ స్టోరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
Also Read : హైదరాబాద్ లో కాల్ బాయ్స్ సేవలు – రెండు గంటలకు రూ.7 వేలు చార్జీ..!