యుద్దవిరమణతో కాంగ్రెస్ కు మేలు చేస్తోన్న బీజేపీ, బీఆర్ఎస్..?

బీఆర్ఎస్ – బీజేపీల మధ్య కోల్డ్ వార్ ఆగిపోవడంతో ఆ  రెండు పార్టీల గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ప్రధానంగా బీజేపీ రెండేళ్ళుగా సంపాదించిన హైప్ ఆరిపోతుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం చేసినా చివరికి దర్యాప్తు సంస్థలు విచారణ వేగాన్ని తగ్గించాయి. దీంతో రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందన్న వాదనలు ఉన్నాయి. ఇవే కాంగ్రెస్పార్టీకి ఆయుధంగా మారాయి. బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకు వెళ్ళలేదు. ఈ సమావేశం జరిగిన రోజునే మంత్రి కేటీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టించింది.

Advertisement

షా తో భేటీ ముగిసిన తరువాత విపక్షాల భేటీపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కలవాల్సింది పార్టీలు కాదు, ప్రజలని చెప్పారు. నిజంగా కలవాల్సిందే ప్రజలే అయితే గతంలో కేసీఆర్ విపక్ష పార్టీలతో భేటీకి ఎందుకు వెంపర్లాడారన్న ప్రశ్నలు వస్తున్నాయి. బీఆర్ఎస్ – బీజేపీల మధ్య ఏదో అండర్ స్టాండింగ్ కుదిరిందని అందుకే విపక్షాల సమావేశం రోజునే బీజేపీతో ఉన్నామని చెప్పేందుకే షా తో భేటీ అయ్యారని అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ , కేటీఆర్ లు గత కొన్నాళ్ళుగా బీజేపీపై విమర్శల వేడిని తగ్గించి కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శల జోరు పెంచారు. బీజేపీపై కేసీఆర్ యుద్ద విరమణ రాజకీయ అవసరమే అయినా దీని వలన రెండు పార్టీలు నష్టపోతున్నాయి.

Advertisement

ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుంది. ఈ క్రమంలోనే కర్ణాటక ఎన్నికల ఫలితం తరువాత కాంగ్రెస్ దూకుడు మరింత పెరిగింది. బీఆర్ఎస్ అసంతృప్త నేతలు, బీజేపీలోని వలస నేతలు ఆయా పార్టీలను వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దం అవుతున్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నాయి. మొత్తంగా కేసీఆర్ స్ట్రాటజీ ఈసారి బోల్తా కొట్టే అవకాశం ఉంది.

Also Read : కాంగ్రెస్ లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – ఎల్బీ నగర్ నుంచి పోటీ..?

Advertisement