Anasuya : అనసూయ అనేది ఇప్పుడు ఒక బ్రాండ్. కొన్నేళ్ల క్రితం అనసూయ అంటే ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలియదు. కానీ.. జబర్దస్త్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది అనసూయ. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉన్న నటి. తనకు సినిమాల్లో వరుస పెట్టి అవకాశాలు వస్తున్నా.. తనకు నచ్చిన పాత్ర అయితేనే సినిమాల్లో నటిస్తోంది. లేదంటే అస్సలు చేయదు. ఇటీవల పుష్పలో మెరిచింది అనసూయ. దానితో పాటు ఇతర ప్రోగ్రామ్స్, యాంకరింగ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది అనసూయ.

నిజానికి.. జబర్దస్త్ కు అంత క్రేజ్ రావడానికి అనసూయ కూడా ఒక కారణం. తన అందం, గ్లామర్, అభినయంతో జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది అనసూయ. అయితే.. దాదాపు జబర్దస్త స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అప్రతిహాతంగా యాంకరింగ్ చేస్తున్న అనసూయ త్వరలోనే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పబోతోందట.
Anasuya : తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ అర్థం అదేనా?
ఇప్పటికే జబర్దస్త్ నుంచి జడ్జిలు, కొందరు టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు అనసూయ కూడా వాళ్ల లిస్ట్ లో చేరబోతోందట. ఇటీవల తను ఇన్ స్టాలో పెట్టిన స్టోరీనే దానికి నిదర్శనం. నా కెరీర్ కు సంబంధించి నేను ఒక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంటున్నాను.. అన్నట్టుగా అనసూయ ఇన్ స్టా స్టోరీ ఉంది. అంటే.. తను నిజంగానే జబర్దస్త్ నుంచి వెళ్లిపోతోందా అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram
మరి అనసూయ వెళ్లిపోతే ఆమె స్థానంలో వచ్చే కొత్త యాంకర్ ఎవరు అనే ప్రశ్నలు అందరినీ సంధిస్తున్నాయి. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మీ ఉంది. రెండు ఎపిసోడ్స్ రష్మీ చేయడం కష్టం కాబట్టి.. జబర్దస్త్ లో అనసూయ బదులు.. మరో యాంకర్ మంజూషను తీసుకున్నారట. తను కూడా మంచి యాంకరే. సినిమాల్లోనూ నటించింది. సినిమా ప్రమోషన్స్ లోనూ తను బిజీగా ఉంటుంది. ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. తను అయితే.. జబర్దస్త్ కు కరెక్ట్ గా సూట్ అవుతుందని జబర్దస్త్ మేనేజ్ మెంట్ అనుకుందట. అందకే.. అనసూయ ప్లేస్ ను మంజూషతో భర్తీ చేశారట. మరి ఇది నిజమా.. అబద్ధమా తెలియాలంటే.. ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.
View this post on Instagram