Guppedantha Manasu 2 July Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 జులై 2022, శనివారం ఎపిసోడ్ 492 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్కాలర్‌షిప్ టెస్ట్ లో ర్యాంకును సాధించిన వసుధరకు డిబిఎస్టి కాలేజ్ వాళ్ళు అభినందనలు తెలియజేస్తూ, ఒక సన్మాన సభను ఏర్పాటు చేయగా అక్కడికి వచ్చిన దేవయాని, సాక్షిలు వసుధరా మీద కోపంతో తనకు అవమానం జరగాలి అని కుట్ర పన్నుతారు. సాక్షి, వసుధార గురించి చెడుగా ఒక ఏవీ తయారు చేసి ఆ పెన్డ్రైవ్ ని ఆ సభ జరిగే అప్పుడు ప్లే చేయమని సభ దగ్గర ఒకరికి ఇస్తుంది. వసుధార పరువు తీయాలి అని సాక్షి, దేవయాని కలలు కంటారు కానీ అలా ఏమీ జరగదు వీళ్ళ కుట్రను ముందే పసిగట్టిన జగతి గౌతమ్ సాయంతో సాక్షి ఇచ్చిన పెన్డ్రైవ్ ని మార్చి వేరే పెన్డ్రైవ్ ని పెడతారు దాంతో దేవయాని, సాక్షి షాక్ అవుతారు.

వసుధార ఏవీని గౌతమ్ ముందే స్వయంగా తయారు చేసి పెడతాడు. అందులో వసుధరా గురించి మీ అభిప్రాయం చెప్పండి అని అందర్నీ అడుగుతాడు గౌతమ్ .ముందుగా జగతిని అడగగా వసు యాక్టివ్ అని, చాలా గోల్స్ ఉన్నాయి, కష్టజీవి అని, తనని చూస్తే చాలా ఆనందం కలుగుతుందని చెప్తుంది. తరువాత మహేంద్రని అడగగా బస్సు ద్వారా మంచి అమ్మాయి, తెలివైనది, కష్టాలను ఎదిరిస్తుంది, ధైర్యం ఉన్న అమ్మాయి, ఒక్కమాటలో చెప్పాలి అంటే ఈ కాలంలో అమ్మాయిలకి రోల్ మొడల్ అని అంటాడు. తర్వాత పుష్పని అడగగా వసుధార ఈ కాలేజీలో ఉన్న అందరికీ ఆదర్శమని చెబుతుంది. ఆ తర్వాత రిషి ని అడగగా వసుంధరకి తెలివి, లైఫ్ మీద స్పష్టత ఉంది అని, కానీ ఒక్కొక్క సారి చిన్న విషయాలకి టెన్షన్ పడుతోందని ఏది ఏమైనా డీబీఎస్టి కాలేజ్ తనని చూసి గర్వపడుతోందని చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నా తను జీనియస్ అని చెబుతాడు.
Guppedantha Manasu 2 July Today Episode : వసుధారను పొగిడిన రిషి
ఏవీ పూర్తి అయిన తర్వాత మినిస్టర్ గారు రిషిని మాట్లాడమని అడగగా రిషి అప్పుడు ఇది పూర్తిగా వసుధార విజయం అని డీబీఎస్టీ కాలేజ్ గర్వపడుతుందని అంటారు. ఆ తర్వాత మినిస్టర్ గారు వసుధార ని మాట్లాడమని అంటాడు. అప్పుడు వసుధార అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఈ విజయం తనది మాత్రమే కాదని రిషి సార్ ఇచ్చిన ధైర్యం అని డీబిఎస్టీ కాలేజ్ వెనుక ఉండి నడిపించిందని, తన విజయాన్ని రిషి సార్ కి అంకితం చేస్తున్నాను అని చెబుతోంది. తర్వాత మినిస్టర్ గారు పూలదండతో వసుధార ని అభినందిస్తాడు.
అప్పుడు రిషి సర్ వసు కి కంగ్రాట్స్ అని చెప్పగానే, వసు మనసులో ఈ విజయం మీదే సార్ అని అనుకుంటూ, తన మెడలోని పూలదండను రిషి మెడను వేస్తుంది. దానితో అందరూ ఆశ్చర్యపోతారు. రిషి తన మెడలోని పూల దండను తీసి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సభ ముగిసిన తర్వాత మహేంద్ర ఆ పూల దండని రిషి కారులో పెడతాడు, పూల దండను చూసిన రిషి దానిని పడేయబోయి, వసు మాట్లాడినట్టు ఊహించుకొని మళ్లీ కారులోనే పెడతాడు. తర్వాత వసుధార దగ్గరికి జగతి, మహేంద్ర వచ్చి, రిషి మెడలో దండ ఎందుకు వేశావు అని జగతి అడగగా, ఎందుకో అలా సడన్ గా వేయాలి అనిపించింది మేడమ్ అని చెబుతుంది. దాంతో జగపతి కోపంగా ఈ మధ్య నీ ప్రవర్తన అర్థం అవ్వట్లేదు అని జీవితంలో ఎన్నో కన్ఫ్యూజన్స్ ఎదురవ్వుతాయి కానీ జీవితం ఒక కన్ఫ్యూజన్ అవ్వొద్దని, క్లారిటీగా ఉండాలని అంటుంది.
దాంతో వసుధార తనకి క్లారిటీ ఉందని, క్లారిటీగా చెప్పలేకపోతున్నాను మేడమ్ అని చెబుతుంది. దాంతో జగతి నాకు సంజాయిషి చెప్పనవసరం లేదు ఎవరైనా అడిగితే సమాధానం తడబడకుండా చెపితే చాలు అని అంటుంది.అప్పుడు వసూ రెస్టారెంట్ డ్యూటీ టైమ్ అవుతుంది అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తరవాత దేవయాని ధరణితో దండ వేయడం ఏంటి , చూసే వాళ్లు ఏమీ అనుకుంటారు అని చెప్పి, ధరణితో కాఫీ తెమ్మని చెబుతుంది. తర్వాత ఇంటికి వచ్చిన జగతి, మహీంద్రాల చూసి దేవయాని మీ సన్మానాలు, సత్కారాలు అయిపోయయా అయినా దండ వేయడం ఏంటి మహీంద్రా అని వెటకారంగా మాట్లాడుతుంది, దినితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్ లొ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రెడీ గా ఉండండి.