Anchor Rashmi : యాంకర్ రష్మీ ఒడిస్సా నుంచి హైదరాబాద్ వచ్చి సినిమాలు చేయాలని హీరోయిన్ గా అవకాశాలు కోసం ఎంతో ప్రయత్నించింది. అయితే అనుకున్నట్టుగా హీరోయిన్ అవకాశాలు రాలేదు. ఆ క్రమంలో ఎన్నో అవమానాలను భరించింది. ఒక అమ్మాయి సినిమాలోకి వస్తానంటే ఎటువంటి ప్రశ్నలు ఎదురవుతాయో అవన్నీ ఎదుర్కొంది. అప్పుడే తనలో ఇంకా కసి పెరిగింది. ఎలాగైనా ఇక్కడ ఏదో ఒకటి సాధించాలనుకుంది. పట్టుదలతో హీరోయిన్ కంటే బుల్లితెర మీద ఏ అవకాశం వచ్చిన చేయడానికి సిద్ధమయింది. స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది.
రష్మీ బుల్లితెర మీద పాపులర్ అయ్యేసరికి గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది. కొన్ని సినిమాలలో చిన్న పాత్రలు పోషించిన అంతగా గుర్తింపు రాలేదు. గుంటూరు టాకీస్ మాత్రం మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టింది. దాంతో వరుసగా పెద్ద సినిమాలలో ఆఫర్లు వస్తాయనుకుంది. కానీ చిన్న స్క్రీన్ మీద నటిస్తే సిల్వర్ స్క్రీన్ మీద తీసుకోవడానికి మేకర్స్ అంతగా ఆసక్తి చూపించరు అదే విషయం రష్మీకి జరిగింది.
Anchor Rashmi : ఎలాగు వాడుకొని వదిలేస్తారని… రష్మీ ఇలా డిసైడ్ అయిందా…

బ్యాంక్ బాలన్స్ తప్ప స్టార్ హీరోయిన్ గా క్రేజ్ రష్మీకి రాలేదు. దానికంటే గ్యాప్ లేకుండా చేసే టీవీ షోలకు మంచి పేరు తెచ్చి పెడుతున్నాయి. అలాగే డబ్బుకు డబ్బు కూడా తెచ్చి పెడతాయని రష్మి గట్టిగా నమ్మింది. అంతే సినిమాలని తిప్పుకుంటారు. అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటారు. అలాంటి సినిమాల వల్ల స్టార్ హీరోయిన్ గా క్రేజ్ రాదు. దాని బదులు బుల్లితెరకే సమయం కేటాయిస్తే ఎక్కువ క్రేజ్ తో చాలా రోజులు కొనసాగవచ్చని నమ్మింది. అందుకే రేష్మి సినిమాల కంటే టీవీ షోలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ విజయవంతంగా కొనసాగుతుంది.