Viral Video : ఓ యువకుడు స్టంట్స్ చేశాడు. అది మామూలు స్టంట్ కాదది.. ప్రాణాలనే పణంగా పెట్టి చేసిన స్టంట్ అది. కరెంట్ ఎంత డేంజరూ అందరికీ తెలుసు కదా. కానీ.. ఈ యువకుడు అస్సలు కరెంట్ నే ఖాతరు చేయలేదు. కానీ.. కరెంట్ షాక్ కొట్టి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో మనం ఇప్పటి వరకు చాలా ఘటనలు చూశాం. అయినా కూడా ఈ యువకుడు మాత్రం అస్సలు పట్టించుకోలేదు.

అసలు చిన్న చిన్న కరెంట్ వైర్లను ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. అలాంటిది హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకొని ఆ యువకుడు వేలాడటం చూసి అందరూ షాక్ అయ్యారు. అసలు.. హైటెన్షన్ వైర్లను పట్టుకొని ఎవరైనా వేలాడుతారా? దాని మీద స్టంట్స్ చేస్తారా ఎవరైనా. కానీ.. ఆ యువకుడు వైర్లను పట్టుకొని స్టంట్స్ చేసి ఆ తర్వాత కిందికి దిగాడు.
Viral Video : కరెంట్ వైర్లను పట్టుకున్నా కరెంట్ షాక్ కొట్టలేదా?
ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమారియా అనే పట్టణంలో రోడ్డు మీద ఉన్న హైటెన్షన్ వైర్లను పట్టుకొని ఓ యువకుడు వేలాడటం చూసి అందరూ షాక్ అయ్యారు. బాబోయ్ ఇదేం స్టంట్ అంటూ అందరూ నోరెళ్లబెట్టారు. ఏం జరుగుతుందో అని టెన్షన్ పడ్డారు. రోడ్డు మీది నుంచి వెళ్లే వాళ్లు అరుపులు, కేకలు మొదలుపెట్టారు. అందరూ చూస్తున్నా కూడా వైర్లకు వేలాడుతూ విన్యాసాలు చేయడం స్టార్ట్ చేశాడు అతడు. అయితే.. అతడు విన్యాసాలు చేసే సమయానికి అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అందుకే అతడికి కరెంట్ షాక్ కొట్టలేదు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
Pilibhit black Amriya me man 11000 volt light ke tar pe for losing his job pic.twitter.com/Rwtq6N1mmI
— Irshad Khan (@IrshadK54670394) September 26, 2022