Anchor Suma : ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు చాలామంది వింత రోగాల భారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా లేడీస్ అయితే చాలా చాలా విచిత్రమైన రోగాల బారిన పడుతూ ఆ విషయాలను ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఈ క్రమం లో ఇటీవల సమంత ఏదో జబ్బుతో బాధపడుతున్నట్లు తెలియజేసింది.అయితే రీసెంట్ గా అదే లిస్టులోకి యాంకర్ సుమ వచ్చి చేరింది. తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు రేర్ డిసీస్ ఉందని ఓపెన్ గా చెప్పేసింది.
తాను కిలాయ్స్ టెన్డేస్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. ఇది ఒక చర్మ వ్యాధి అని దీనివలన గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. అంతేకాక ఈ సమస్యల వలన మేకప్ వేసిన ప్రతిసారి రాసేస్ ,దురదలు రావడం మరి ముఖ్యంగా చర్మంపై మంట వచ్చేవని అయినా సరే అవన్నీ భరించి మేకప్ వేసుకున్నానని చెప్పుకొచ్చింది.
అయితే తాను కెరియర్ మొదలుపెట్టిన కొత్తలో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి , ఎలా తీసుకోవాలి అన్న విషయాలు తెలిసేవి కాదట. ఇక అవే తన చర్మానికి బాగా డామేజ్ చేసిందని, ఆ తర్వాత ఆ విషయాలపై కాన్సన్ట్రెస్ చేసి నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. తనకి ఒకచోట గాయమైతే అది పెద్దదిగా మారి చుట్టుపక్కల వ్యాపించి మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉండేదని సుమా తెలియజేసింది. దీంతో సుమ కూడా ఇలాంటి డేంజరస్ జబ్బు కు గురైందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రస్తుతం సుమా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.