Aata Sandeep Biography : తెలుగు చిత్ర పరిశ్రమలో సైడ్ డాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టిన సందీప్ ఆట షోలో డాన్సర్ గా టైటిల్ గెలుచుకొని ఆట సందీప్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటినుంచి స్టేజి షోలు, సినిమా ఈవెంట్స్, టీవీ షోలతో తన డ్యాన్స్ తో అలరిస్తూ వస్తున్నారు ఆయన. తన భార్య జ్యోతి రాజ్ కూడా మంచి డాన్సర్ ఇద్దరు కలిసి పర్ఫామెన్స్ లు ఇస్తూ ఉంటారు. వీళ్ల డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆట సందీప్ బిగ్ బాస్ సీజన్ 7 కి ఎంట్రీ ఇచ్చారు.
ఆట షో తర్వాత సందీప్ స్టెప్స్ స్టూడియో ని నిర్వహించి సీఈఓ గా పనిచేశారు. 15 సంవత్సరాలుగా డాన్స్ అకాడమీ ని నడిపిస్తున్నారు. కొన్ని వందల మందికి డాన్స్ నేర్పించారు. పలువురు హీరో, హీరోయిన్లు, సీరియల్ నటీనటులు ఆయన దగ్గర డాన్స్ నేర్చుకుంటూ ఉంటారు. లీడర్ పవనిజం సినిమాలకు సహకారం కూడా అందించారు. అంతేకాదు సూపర్ మచ్చి, ఇందువదన, జగన్నాటకం సినిమాలలో కూడా నటించారు. ఆట సందీప్ ఆయన భార్య జ్యోతి రాజ్ ఇద్దరు కలిసి జగన్నాటకం సినిమాలో నటించారు. ఇటీవల స్టార్ మా లో నీతోనే డాన్స్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలకి ఈవెంట్లకి కొరియోగ్రాఫ్ చేస్తూ కాస్త బిజీగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆట సందీప్ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. చాలా కష్టపడి ఫ్లాట్ ని సొంతం చేసుకున్నామని చాలా సంతోషంగా ఉందని ఒక వీడియోలో కూడా చెప్పారు. ఇక ఆయన ఆస్తి సుమారుగా రెండున్నర కోట్ల వరకు ఉంటుందని సొంత కారు సొంత నివాసం సమాచారం.