AP Assembly Sessions : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూనే టిడిపి వైసిపి సభ్యుల మధ్య మాటలు యుద్ధం ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఆధారాలతో దొరికిపోయారని మంత్రి అంబటి అనగా వారి తీరును తప్పుపట్టారు టిడిపి అధినేతలు. దీంతో అసెంబ్లీ సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్టుపై మాట్లాడాలని అతనిపై ఉన్న కేసులను ఎత్తివేయాలని టిడిపి సభ్యులు స్పీకర్ ను చుట్టుముట్టారు. లోక్ సభ స్పీకర్ పై పేపర్స్ విసురుతు టిడిపి , సభ్యులు ఆందోళన నిర్వహించారు. చంద్రబాబుపై ఉన్న కేసులను కొట్టేయాలంటూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలో వాయిదా తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుతో ఇంకా చాలా అంశాలు చర్చించడానికి సిద్ధంగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్పీకర్ ముందు ఉన్న లాప్టాప్ ను లాగేందుకు ఎమ్మెల్యే కోటరెడ్డి ప్రయత్నం చేశారు. టిడిపి సభ్యుల ప్రవర్తనతో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని మంత్రి అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ కక్ష చర్య సాధింపు కాదంటూ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉండగా బాలకృష్ణ చేతితో సైగలు చేశారు. బాలకృష్ణ చేసిన సైగలతో వైసిపి సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా పొడియం దగ్గరకు వెళ్లి ఆందోళన చేపట్టారు.
బాలకృష్ణ సినిమాల్లో మీసం తిప్పుకోవాలి కానీ అసెంబ్లీలో కాదంటూ మంత్రి అంబటి పేర్కొన్నారు. దమ్ముంటే రావాలంటూ బాలకృష్ణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా సాగుతుండగా బాలకృష్ణని చూస్తూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడ గొట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఇదంతా గమనించిన స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించాడు. అయితే టిడిపి సభ్యులు అటు శాసనసభ మండలి లోను చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం కోరారు. కానీ వాయిదా తీర్మానాన్ని మండల చైర్మన్ తిరస్కరించడంతో టిడిపి శాసనసభ సభ్యులు నిరంతరం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నిరసనలు ఏపీ రాజకీయాలలో ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.