Vishnu Priya : బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. పోవే పోరా ప్రోగ్రాం తో ఫేమస్ అయిన విష్ణు ప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి యువకులను వేడెక్కిస్తుంటుంది. అయితే విష్ణు ప్రియ కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసింది. యాంకర్ విష్ణు ప్రియ ఇటీవల ఓ వీడియో సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలో తన అందచందాలతో కేక పెట్టించింది. ఈ పాటకు యూట్యూబ్లో మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి.
అయితే విష్ణు ప్రియ ఈ సాంగ్ ప్రమోషన్ కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది. ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే లేదు ప్రతి రంగంలోనూ స్త్రీలకు ఇబ్బందులు తప్పట్లేదని తెలిపింది. తనకు కెరీర్ మొదట్లో సినిమాలో ఛాన్స్ ఇస్తాం కోరిక తీరుస్తావా అని కొందరు అడిగారని సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఆమె వాటికి నో చెప్పి అలాంటి అవకాశాల్ని వదిలేసుకున్నారని తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్…

ఇక యాంకర్ విష్ణుప్రియ లేటెస్ట్ గా నటించిన సినిమా ‘ వాంటెడ్ పండుగాడ్ ‘. ఈ సినిమా దర్శకుడు కే రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక తాజాగా కొన్ని ఫోటోలను వీడియోలను పంచుకుంటుంది విష్ణు ప్రియ. ఆ ఫోటోలో ఓ రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ కుర్రాలను హీటెక్కిస్తుంటుంది. ఈ అమ్మడు తాజాగా నల్ల చీరలో ఓ రేంజ్ లో అదరగొట్టింది. నడుము అందాలను ఫోకస్ చేస్తూ నల్ల చీరలో కేక పెట్టించింది. దీంతో ఆ ఫోటోలపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు కేక, చీరలో అదిరిపోయావని అంటుంటే మరికొందరు ఈ రేంజ్ లో ఆరబోత ఏంట్రా బాబు అంటున్నారు. ఇదంతా అటెన్షన్ కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.