Health Tips : ప్రస్తుత కాలంలో చాలామంది అనేక కారణాల వలన రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. సరిగా నిద్ర పట్టక ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి కొన్ని ఆహార పదార్థాలు సహాయపడతాయని చెప్పాలి. మీరు తీసుకునే ఈ ఆహారం మీ నిద్రపై ప్రభావం చూపుతుంది. మరి నిద్రకు సహకరించే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రి సమయంలో గాఢంగా నిద్ర పోవాలంటే ఖచ్చితంగా పాలు తాగాలి. గోరువెచ్చని పాలు తాగడం వలన త్వరగా నిద్ర పడుతుంది. అంతేకాక వెంటనే ఘాడ నిద్రలోకి జారుకుంటారు. ఎందుకంటే పాలలో త్రిప్టోఫోన్ అనేది నిద్రకు దోహదపడేలా చేస్తుంది.
దీనివలన కళ్ళకు పూర్తి విశ్రాంతి దొరికి వెంటనే నిద్ర పడుతుంది ,అలాగే పాలలో ఉండే కాల్షియం బ్రెయిన్ లోని నరాలని ఫ్రీ చేస్తుంది. అలాగే పడుకునే సమయంలో అరటి పండ్లు తినడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది. అరటిపండ్ల లో ఉండే టెప్టో ఫోన్ మరియు విటమిన్ బి , మెగ్నీషియం ,పొటాషియం వంటి పోషకాలు మంచి నిద్రకు సహాయపడతాయి. అలాగే వాల్ నట్స్ ఎలక్ట్రోనిన్ అధికంగా ఉన్న పదార్థాలు కూడా నిద్రకు బాగా దోచేస్తాయి. వీటిని రాత్రి సమయంలో తీసుకోవడం వలన మంచి నిద్ర పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఇలాంటి మంచి స్నాక్స్ తినడం వలన వెంటనే నిద్ర పడుతుంది.
ఇక బాధంలో మెగ్నీషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడును రిలాక్స్ చేసి వెంటనే నిద్ర పట్టేలా దోహదపడుతుంది. అలాగే గుమ్మడి విత్తనాలు తినడం వల్ల కూడా రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోవచ్చు.ఇక దీనిలో ఉండే హార్మోన్లు నిద్రకు కారణమయ్యే హార్మోన్స్ ను ప్రోత్సహించడంతో అలాగే ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉండటం వలన వెంటనే నిద్ర పడుతుంది.అదేవిధంగా ప్రతిరోజు కివి పండ్లను తినడం వల్ల కూడా నిద్ర క్వాలిటీ పెరుగుతుంది. కావున ఎవరైనా నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి డాక్టర్ ను సంప్రదించి పైన చేపిన చిట్కాలు పాటించవచ్చు.