Pawan Kalyan – Sreeja : ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పలు సినీ, రాజకీయ సెలబ్రిటీల మీద ఇప్పటికే చాలా కామెంట్స్ చేశారు. వాళ్ల జాతకం రిత్యా ఎవరికి ఏం జరుగుతుందో చెప్పాడు. అవి నిజం అయ్యాయి కూడా. సమంత, నాగ చైతన్య విడాకుల విషయం గురించి కూడా ఆయన ముందే చెప్పాడు. అప్పుడు ఎవ్వరూ నమ్మలేదు కానీ.. చివరకు ఆయన చెప్పిందే జరిగింది. ఇలా.. ఆయన చెప్పిన చాలా విషయాలు నిజం అయ్యాయి. దీంతో ఆయన జ్యోతిష్యానికి చాలా డిమాండ్ పెరిగింది.
తాజాగా పవన్ కళ్యాణ్, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విషయంలో కూడా వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. శ్రీజ రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రెండో పెళ్లి విషయంలోనూ తను విడాకులు తీసుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీజ మూడో పెళ్లి మాత్రమే కాదు.. తను నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందని ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలిపాడు.
Pawan Kalyan – Sreeja : పవన్ కళ్యాణ్ కూడా నాలుగో పెళ్లి చేసుకుంటాడా?
అంతే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా నాలుగో పెళ్లి చేసుకుంటాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. జాతకం ప్రకారం.. పవన్ కళ్యాణ్, శ్రీజ ఇద్దరూ నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారట. పవన్ కళ్యాణ్, శ్రీజ ఇద్దరిదీ ఒకే జాతకం అట. వీరిద్దరి జాతకంలో కుజుడు నీచంలో ఉన్నారని వేణు స్వామి వెల్లడించాడు. కుజుడు నీచ స్థానంలో ఉన్న వాళ్లకు నాలుగు పెళ్లిళ్లు అవుతాయట.
శ్రీజ.. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి కళ్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ తోనూ విడాకులు ఇస్తోందని వార్తలు వస్తున్నాయి. తన స్నేహితుడిని మూడో వివాహం చేసుకుంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ముందు వైజాగ్ కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రేణు దేశాయ్ తో సహజీవనం చేశాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లిగా రష్యాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ఆయన జాతకంలోనూ నాలుగో పెళ్లి ఉందంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశాడు.