Priyamani : హీరోయిన్ ప్రియమణి తెలుగులో జగపతిబాబు హీరోగా నటించిన ‘ పెళ్లయిన కొత్తలో ‘ సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘ యమదొంగ ‘ సినిమా చేసి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత నాగార్జునతో ‘ రగడ ‘,గోపీచంద్ తో గోలీమార్, నితిన్ తో ద్రోణా లాంటి సినిమాలు చేసి ఆ ఆకట్టుకుంది. అంతేకాదు చారులత అనే సినిమాతో నటించి నటన పరంగా అందరి ప్రశంసలు అందుకుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే ప్రియమణి ముస్తఫా రాజుని వివాహం చేసుకుంది. దాంతో హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి.
దగ్గుబాటి హీరోల వల్ల రీఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రియమణి. నేషనల్ అవార్డు అందుకున్న ప్రియమణి అంటే ఇప్పటికీ తమిళంలో తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అందుకే పెళ్లి అయి గ్యాప్ తీసుకున్న కూడా మళ్లీ సురేష్ ప్రొడక్షన్స్ వారు ఒకేసారీ రెండు సినిమాలలో అవకాశాలు ఇచ్చారు. ఆ సినిమాలే నారప్ప, విరాటపర్వం సినిమాలు. నారప్పలో విక్టరీ వెంకటేష్ సరసన నటించింది. తమిళంలో ధనుష్ నటించిన సినిమాకి నారప్ప రీమేక్ గా వచ్చింది. ఈ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం ప్రియమణి హీరోయిన్గా నటించిన మొదటి సినిమా పరుత్తి వీరన్. ఈ సినిమాలతో తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా ఏకంగా జాతీయ అవార్డు ని అందుకుంది.
Priyamani : ఆ ఫ్యామిలీ హీరోల వలనే… ప్రియమణికి అవకాశాలు రావట్లేదా…

హీరోయిన్ గా మళ్లీ రీఎంట్రీ వెంకటేష్ రానాలతో ఇచ్చింది. సినిమా అనగానే మళ్ళీ పెద్ద హీరోలు పెద్ద బ్యానర్స్ అవకాశాలు వస్తాయని పాపులారిటీ మరో లెవల్ లో ఉంటుందని ఊహించుకుంది. కానీ ప్రియమణికి దగ్గుబాటి హీరోల సినిమాల వల్ల ఏమాత్రం కలిసి రాలేదు. వెంకటేష్ సినిమా అయితే ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం వెంకీకి దక్కింది. ఇక రానా నటించిన విరాటపర్వం సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఇప్పటి వరకు అవకాశాలు దక్కలేదు. సినిమాలలో ఛాన్స్ రాకపోయినా బుల్లితెరలో తన హంగామా చూపిస్తుంది.