Antibiotics : చాలామంది చిన్న ఆరోగ్య సమస్యకు కూడా ఎన్నో మందులు వాడుతారు. అలాగే పెద్దల నుండి పిల్లల వరకు యాంటీబయోటిక్స్ మందులను తెగ వాడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మాత్రమే యాంటీబయోటిక్స్ ప్రభావితంగా ఉంటాయి.887 అయితే వానాకాలంలో పిల్లలు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వైరల్ అని అభిప్రాయపడుతూ యాంటీబయోటిక్స్ మందులను వాడుతున్నారు. వీటి ఫలితంగా చిన్నవయసులోనే అరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
డెంగ్యూ, కోవిడ్ ,వైరల్ ,డయేరియా వాంతులు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లల్లో 80 శాతానికి పైగా ఇన్ఫెక్షన్లకు కారణమవుతుండగా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు 10 శాతంగా ఉంటున్నాయి. చిన్నపిల్లలకు గొంతు నొప్పి అనగానే అజిత్రాల్ వేసుకోమని తల్లిదండ్రులే చూసిస్తుంటారు. ఇవి డయేరియా, వామీటింగ్ వంటి దుష్పవాలకు కారణాలవుతున్నాయి. అదే టైంలో మనకు ఉపయోగపడే గట్ బ్యాక్టీరియాని చంపేస్తుందని వైద్యులు చెబుతున్నారు. యాంటీ వైరల్ మందులు తీవ్రమైన ఫ్లూ ,చికెన్ బాక్స్ వంటి కొన్ని ఇన్ఫెక్షన్లకు మాత్రమే ఉద్దేశింపబడినవి. కొందరు పిల్లల తల్లిదండ్రులు వైద్యులను యాంటీబయాటిక్ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.
Antibiotics : చిన్నపిల్లలకి యాంటీబయోటిక్స్ మందులను ఇస్తున్నారా… అయితే ఆరోగ్య నిపుణుల హెచ్చరిక…

యాంటీబయోటిక్స్ మందులను ఇవ్వమని తమపై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. విచ్చలవిడిగా విచక్షణ రహతంగా యాంటీబయోటిక్స్ ని ఉపయోగించడం వల్ల యాంటీ బాడీ లు నిరోధకనికి గురి అవుతాయని వారు చెబుతున్నారు. తల్లిదండ్రులు డాక్టర్ సలహా తీసుకోకుండానే తమ పిల్లలకు తమకు తెలిసిన మందులను ఇస్తున్నారు. ఇది తమ పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకి ఎటువంటి మందులు వేయాలన్నా సరే డాక్టర్ సలహా తీసుకునే మందులు వాడాలని చెపుతున్నారు. పిల్లలకు యాంటీబయోటిక్స్ మందులను తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే వాడటం ఉత్తమం