Rashmika : పుష్ప మూవీ తో ఒక్కసారిగా జాతీయస్థాయిలో లైన్ లైట్ లోకి వచ్చినటువంటి బ్యూటీ రష్మిక మందన్న. ఫ్యాన్ ఇండియాలో రిలీజ్ అయ్యి ఒకసారిగా ఈ బ్యూటీకి అన్ని భాషలలో అవకాశాలు వరుసగా లభించాయి. తెలుగు తమిళ్ మరియు కన్నడలో ప్రస్తుతం అనేక అవకాశాలతో బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల రిలీజై సక్సెస్ సాధించిన సినిమా సీతారమం. ఈ సినిమాలో ఓ కీలక రోల్ చేసి మంచి పేరును కొట్టేసింది రష్మిక. బాలీవుడ్ లో రష్మిక ఇప్పుడు ఏంటి ఇస్తున్న సినిమా “గుడ్ బై”. అయితే ముందుగా బాలీవుడ్ లో సైన్ చేసినటువంటి సినిమా మిస్టర్ మజ్ను.
ఈ సినిమా రిలీజ్ కి కొంత సమయం పట్టడంతో గుడ్ బై మూవీ ముందుగా రిలీజ్ అవుతోంది. గుడ్ బై సినిమాలో ఈ అమ్మడు లెజెండ్రీ యాక్టర్ అమితాబచ్చన్ కూతురుగా కనిపిస్తుంది. ఈ సినిమాకి డైరెక్టర్ గా వికాస్ బాల్ తెరకెక్కించారు. ఈ సినిమా కామెడీతో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కి అక్టోబర్ 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు రిలీజ్ అయినా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా మెప్పించింది.
Rashmika : నేషనల్ క్రష్ రష్మికకు అక్కడ లక్ ఎంతవరకు కలిసి వస్తుందో…

దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా రష్మిక మొదటగా హిందీలో రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ఈమె ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈమె బాలీవుడ్లో మంచి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మొత్తంగా ఇప్పుడు రష్మిక మొదటి సినిమా హిందీలో రిలీజ్ అవుతుండడంతో నటిగా రష్మిక ఎంత మేరకు సక్సెస్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.