Bigg Boss 7 : బిగ్ బాస్ 7 మూడవ వారం నామినేషన్స్…..ఇలా జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు….

Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ 7 రెండు వారాలను పూర్తి చేసుకుని మూడవ వారంలోకి అడుగు పెట్టింది. అయితే మొన్నటి వరకు కలిసికట్టుగా ఉన్న సీరియల్ బ్యాచ్ అమర్దీప్ ,ప్రియాంక జైన్, శోభ శెట్టి ఏ పని చేసిన కలిసే చేశారు. గత రెండు వారాలలో నామినేషన్స్ కూడా వీరు అనుకుని చేసినట్లు స్పష్టంగా అర్థమైంది. కానీ ఈ వారం ఊహించని విధంగా ఉల్టా పుల్టా గా మారింది. ఎందుకంటే ప్రియాంక జైన్ మరియు అమర్దీప్ మధ్య పెద్ద వాదన చోటుచేసుకుంది. మరి ముఖ్యంగా అమర్ దీప్ ప్రియాంక ను నామినేట్ చేసినట్లుగా ఇటీవల విడుదలైన ప్రోమోలో అర్థమవుతుంది.  ఇవాళ విడుదలైన ప్రోమో మొదట్లో ముందుగా నామినేషన్స్ కి దామిని వచ్చింది.

Advertisement

bigg-boss-7-3rd-week-nominations-who-would-have-expected-this-to-happen

Advertisement

ఇద్దరికీ ఛాన్స్ ఉందని ఎక్కువమందికి ఉంటే బాగుండేదని అందరికీ వేసేదాన్ని అంటూ దామిని మాట్లాడండి. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ ప్రియాంక జైన్ ను నామినేట్ చేశాడు. ఆమె ఆటిట్యూడ్ అస్సలు బాలేదంటూ రీజన్ చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ప్రియాంక నీ ఆటిట్యూడ్ సరిగ్గా ఉందా అంటూ ఫైర్ అయింది. అనంతరం శుభశ్రీ ప్రియాంకను నామినేట్ చేయడంతో నామినేషన్స్ హీట్ పెరిగింది . ఈ క్రమంలోనే నువ్వు చేసేది కరెక్ట్ కాదంటూ ప్రియాంక వేలు చూపిస్తూ సీరియస్ అయింది. అనంతరం ఎవరు ఊహించని విధంగా అమర్ దీప్ పెద్ద ట్రస్ట్ ఇచ్చాడు. ప్రియాంక ని నామినేట్ చేస్తూ…..రోటి కచ్ రా మాత్రమే పెద్ద పని కాదు… దానికి మించిన పనులు చాలా ఉన్నాయని ప్రియాంక ని నామినేట్ చేశారు.

దీంతో ప్రియాంక గట్టిగానే ఫైర్ అయింది. ఇక ప్రోమో చివర్లో వచ్చిన ప్రశాంత్ తేజ మధ్య గొడవ నవ్వులు పూయించింది. టేస్టీ తేజ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ నీకు బిగ్ బాస్ ప్రక్రియ సరిగా అర్థం కాలేదని నా ఫీలింగ్ అంటూ చెప్పుకొచ్చాడు. నాకు అర్థం కాలేదని నీకెలా తెలుసు అంటూ ప్రశాంత్ పాయింట్ లాగాడు. అలాగే నీకు అస్తమానం పాజిటివ్ , నెగటివ్ కేవలం నా దగ్గర ఎందుకు వస్తుంది అంటూ అపరిచితుడిలా మారిపోయాడు ప్రశాంత్. అంతేకాక తేజ వచ్చి ప్రశాంత్ తోడ కొడుతూ కామెడీ చేశాడు. అనంతరం టేస్టీ తేజను ఇమిటేట్ చేస్తూ ప్రశాంత్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో బిగ్ బాస్ హౌస్ మొత్తం నవ్వులతో మునిగిపోయింది. ఏం చెప్పాలో తెలియక టేస్టీ తేజ కూడా నవ్వుకున్నారు.

Advertisement