Vijay Antony : తమిళ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆయన కూతురు లారా ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం అందరిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే గతంలో విజయ్ ఆంటోనీ ఆత్మహత్యల గురించి కీలక కామెంట్స్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన విజయ్ ఆంటోని ఆ తరువాత సలీం, డాక్టర్ సలీం వంటి సినిమాలలో నటించారు.
అయితే ఈరోజు విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నైలోని డిడి కే రోడ్డులో నివాసం ఉంటున్నారు. తన కుమార్తె లారా ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. ఆ గదిలో ఆమె ఒక్కతే నిద్రపోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఉదయమే చూసి ఆమె తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమె మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటన సినీ ఇండస్ట్రీలో తీవ్రవిషధాన్ని నెలకొల్పింది. అయితే విజయ్ ఆంటోనీ కూతురు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఇదే చివరికి ఆమె ఆత్మహత్యకు కారణం అయి ఉంటుందని అంటున్నారు.
అయితే ఈ ఒత్తిడికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆమె కొద్ది రోజులుగా వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఈ సమయంలో గతంలో విజయ్ ఆంటోని ఆత్మహత్యల గురించి మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. అసలు ఆత్మహత్యలకు కారణం ఏంటో వివరించారు. ఈ ఆత్మహత్యలకు పాఠశాలలు తల్లిదండ్రులే కారణమని చెప్పారు. పిల్లలపై తీవ్ర ఒత్తిడి తీసుకురావద్దని చెప్పారు. విజయ్ ఆంటోని అంతా గొప్పగా ఆలోచిస్తే ఆయన కుమార్తె ఎలా ఆత్మహత్య చేసుకుందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆమె ఒత్తిడికి గురైందా లేక వేరే కారణాల వలన ఆత్మహత్య చేసుకుందా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.