Bigg Boss Season 6 : బుల్లితెరలో బిగ్ బాస్ షో కి మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ మొదలై వారం అవుతుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ లో ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్ నుంచి బయటికి వస్తారో ఒక సమాచారం బయటకు వచ్చింది. బిగ్ బాస్ తెలుగు మొదటి వారానికి దగ్గర అయింది. మరి వారాంతం వస్తుందంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. అందులోనూ ఫస్ట్ ఎలిమినేషన్ అంటే అందరిలో టెన్షన్ బాగా ఉంటుంది. అసలు హౌస్ ఏంటో అర్థం కాకుండా, పర్ఫామెన్స్ ఇవ్వకముందే ఎలిమినేట్ కావాల్సి వస్తుంది. దీంతో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనేది ఆసక్తి కొనసాగుతుంది.
ఈవారం ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఆదివారం ఈ ఏడుగురు సభ్యుల్లో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వస్తారు. ఎలిమినేషన్ లిస్టులో ఆరోహిరావు, పైమా, చలాకి చంటి, అభినయశ్రీ ,సింగర్ రేవంత్, ఇనయ సుల్తానా, శ్రీ సత్య ఉన్నారు. సింగర్ రేవంత్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. అతడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందులోను ఈ సీజన్లో టాప్ సెలబ్రిటీ. అలాగే చలాకి చంటి, ఫైమా జబర్దస్త్ కమెడియన్స్ గా ప్రేక్షకులకు పరిచయం. అందులోనూ పైమా వయసులో చిన్నదైనా సైలెంట్ గా ఉండకుండా గేమ్ మొదలుపెట్టింది.
Bigg Boss Season 6 : బిగ్ బాస్ లో ఎలిమినేట్ కాబోతున్న టాప్ కంటెస్టెంట్…

అలాగే ఆరోహి రావు ప్రేమకథలంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. శుక్రవారం వరకు పోలైన ఓట్లను పరిశీలన చేస్తే అభినయశ్రీ, ఇనయ సుల్తానా ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు.. అయితే ఇద్దరిలో అభినయశ్రీ పేరు బాగా వినిపిస్తుంది. ఇనయ సుల్తానా మంచో చెడో నోరు తెరిచి మాట్లాడుతుంది. ఒకటి రెండు టాస్కులలో పాల్గొంది. అభినయశ్రీ మాత్రం మౌనంగా ఉంటున్నారు. అసలు బిగ్ బాస్ కెమెరాలు ఫోకస్ అయ్యేలా ఆమె ఏ పనులు చేయడం లేదు. ఈ క్రమంలో అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొద్ది సేపట్లో దీనిపై స్పష్టత రానుంది.