Intinti Gruhalakshmi 11 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 11-September-2022 ఎపిసోడ్ 735 ముందుగా మీ కోసం తులసి వాళ్ల ఇంట్లో, వినాయక చవితి వేడుకలు ఘనంగా మొదలవుతూ ఉంటాయి.అందరూ సంతోషంగా పనులు చేస్తూ ఉండగా, అక్కడికి ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు, మొదట లక్కీ వచ్చి, సరదాగా మాట్లాడతాడు, ఇంతలో హనీ పాప కూడా వస్తుంది,సామ్రాట్ కారులోనే ఉంటాడు, కారులో కూర్చొని ఆలోచిస్తూ వుంటాడు, సామ్రాట్ని చూసుకోకుండా, లాస్య, నందు ఇద్దరూ మాట్లాడుతూ ఉంటారు. లాస్య నిజాలన్నింటినీ తన నోటితోటే చెబుతుంది, ఆ నిజాలన్నింటినీ సామ్రాట్ విని షాక్ అవుతాడు, నందు, లాస్య లోపలికి వెళ్లగానే, సామ్రాట్ కారుదిగి ఆశ్చర్యపోయి, నేను తులసి గారికి ఇంత అపార్థం చేసుకున్నాను, ఒక్కమాట నేనే తులసి గారిని అడిగి ఉంటే, ఇంత దూరం వచ్చేది కాదు అని అనుకుంటూ ఉంటాడు.
ఒకవైపు లాస్య, నందు ఇద్దరు, దివ్య కోసం నందు పూజ చేశాడు, ప్రసాదం ఇచ్చి వెళదాము అని వచ్చాము అనే వంకతో ఇద్దరూ ఇంట్లోకి వస్తారు, దివ్య ప్రసాదం తీసుకుంటుంది,వాళ్ళు వెళ్లబోతుంటే వాళ్లని అభి ఆపుతాడు, ఏంటమ్మా సాంప్రదాయాలు, గౌరవాలకి మన ఇల్లు పెట్టింది పేరు కదా, మరి ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్లిపోతుంటే, ఆపవా అని అనగానే, వాళ్లని ఎవ్వరు వెళ్లమని చెప్పారు, సతీసమేతంగా ఇక్కడే ఉండండి, పూజ చేసుకుని వెళ్లండి అని తులసి అంటోంది.దాంతో లాస్య, నందు కూడా అక్కడే ఉంటారు, తర్వాత హనీ మాటలలో తెలుస్తుంది, సామ్రాట్ కారులోనే ఉన్నాడు అని, అప్పుడు తులసి ఇంటి వరకు వచ్చి, ఇంటి బయటే ఉన్నారా అని సామ్రాట్ని పిలవడానికి బయటికి వెళుతోంది.తులసి నమస్కారం చేస్తూ, సామ్రాట్ని అడుగు అడుగుతుంది,
Intinti Gruhalakshmi 11 September Today Episode : తులసి మీద పడ్డ నిందలు పోనున్నాయా?

దయచేసి ఇంట్లోకి రండి, పూజకి రండి అని,ఇదంతా లాస్య, నందు చూస్తూ ఉంటారు,తులసి బ్రతిమిలాడటంతో సామ్రాట్ కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాడు, అప్పుడు తులసీ వాళ్ళ మామయ్య ఇలా అంటూ ఉంటాడు, చాలా సంతోషంగా ఉంది బాబు, మిమ్మల్ని ఆ వినాయకుడే ఇక్కడికి రప్పిస్తున్నాడు అని అంటూ ఉంటారు. అప్పుడు హనీ నాన్నా మీరు కూడా పూజ చేయండి అని అనగానే, అప్పుడు అభి, ఇంత గొడవ చేసి, మా ఇంటి పైన, ఇప్పుడు పూజకి వచ్చారా అని వెటకారంగా అంటాడు, అభి వెటకారంగా మాట్లాడిన దానికి ఇంట్లోవాళ్లు అభి పైన కోప్పడతారు,సామ్రాట్ గారికి అభి తరుపున క్షమాపణలు చెప్పి, దయచేసి మీరు రండి లోపలికి అని, సామ్రాట్ గారిని ఇంట్లోకి తీసుకుని వెళతారు.అయితే నిజం తెలిసినా సామ్రాట్, అందరిముందు నిజాన్ని చెబుతాడా లేదా, లాస్య చేత, నందు చేత నిజాన్ని చెప్పిస్తాడు, ఏం జరగబోతోంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది