Bill Gates : బిల్ గేట్స్ పేరు వింటే చాలు.. మనకు గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్. అవును.. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలియని వాళ్లు ఉండరు. కొన్ని కోట్లు కంప్యూటర్లు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఆధారంగా నడుస్తున్నాయి. దానికి ఆజ్యం పోసింది ఆయనే. మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించి ఎన్నో సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ ను డెవలప్ చేశాడు బిల్ గేట్స్. అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన ఒకరు. అటువంటి బిల్ గేట్స్.. ఎక్కడో యూఎస్ లో ఉండే ఆయన.. మన తెలుగు హీరోలలో ఒక హీరోను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నాడు. అసలు.. మన తెలుగు హీరోను బిల్ గేట్స్ ఎందుకు ఫాలో అవుతున్నాడు. ఇంతకీ ఆ తెలుగు హీరో ఎవరు? అంటారా.. పదండి తెలుసుకుందాం.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. మన మిల్కీ బాయ్ మహేశ్ బాబు. అవును.. సూపర్ స్టార్ మహేశ్ బాబునే ట్విట్టర్ లో బిల్ గేట్స్ ఫాలో అవుతున్నాడు. అసలు విషయం ఏంటంటే.. సర్కారు వారి పాట సినిమా తర్వాత టూర్ కు చెక్కేశాడు మహేశ్. తన ఫ్యామిలీతో పాటు ప్రస్తుతం ఫారెన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా న్యూయార్క్ లో బిల్ గేట్స్ ను తన భార్యతో కలిసి మహేశ్ కలిశాడట. ఆయన్ను కలిసిన ఫోటోను మహేశ్.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
Bill Gates : ట్విట్టర్ తో పాటు ఇన్ స్టాలోనూ మహేశ్ ను ఫాలో అవుతున్న బిల్ గేట్స్
మహేశ్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. న్యూయార్క్ లో ఉండటం అంటే చాలా ఫన్ గా ఉంటుంది. నిన్ను, నమ్రతను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ బిల్ గేట్స్ ట్వీట్ చేశాడు. ఇక.. మహేశ్ బాబు ట్వీట్ ను రీట్వీట్ చేయడం.. నిన్ను కలవడం సంతోషంగా ఉందని అనడం.. అందులోనూ మహేశ్ బాబును ట్విట్టర్ తో పాటు ఇన్ స్టాలో ప్రపంచ కుబేరుడు ఫాలో అవుతుంటే.. మహేశ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? సోషల్ మీడియాలో గోల గోల చేస్తున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. మహేశ్ షేర్ చేసిన ఫోటో, ట్వీట్లను తెగ వైరల్ చేస్తున్నారు. దేశంలోనే ఏ సినిమా సెలబ్రిటీని కూడా బిల్ గేట్స్ ఫాలో అవడం లేదని.. కేవలం మహేశ్ బాబునే ఫాలో అవుతున్నాడంటే.. అది మహేశ్ బాబు గొప్పదనం అంటూ మహేశ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Being in New York is always fun – you never know who you’ll run into. It was great meeting you and Namrata! https://t.co/qBykgcXDS6
— Bill Gates (@BillGates) June 30, 2022