Viral Video : పిల్లి పంచుకు ఎగిరిపడ్డ కోడెదూడ, ఏందిరా అయ్యా ఇలా కూడా జరుగుతుందా….

Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో అది ఇవి అని లేకుండా మనుషులు జంతువులు చేసే వీడియోలు వైరల్ అవుతూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో జంతువులు చేసే వీడియోలు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. మన మధ్యనే తిరుగుతూ మనతో పాటు ఉండే పెంపుడు జంతువులు ఒక్కోసారి అవి చేసే చేష్టలకు ఆశ్చర్య పోవాల్సి వస్తుంది. మన చుట్టూ ఉండే పిల్లి, కుక్క ,ఆవు ,మేక ఇలాంటి జంతువులు చేసే చేష్టలకి ఒక్కొక్కసారి కడుపుబ్బా నవ్వొస్తుంది.

ఇలాంటి వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది ప్రేక్షకులను అంమితంగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూస్తే జనాలు అమితంగా నవ్వుతూ ఉంటారు. అటువంటి వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో నవ్వుల పూలు పూయిస్తుంది. పిల్లి ,ఆవు మధ్య జరిగిన ఈ సంఘటనలతో జనాలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఆవు దూడ చిన్నపిల్లి కలిసి చేసిన ఈ వీడియోలో ముందుగా పిల్లి, ఆవు ముందుకు వచ్చి ఏదో పలకరించినట్లుగా చూస్తుంది.

Viral Video : పిల్లి పంచుకు ఎగిరిపడ్డ కోడెదూడ

cat and cow video gone viral in social media
cat and cow video gone viral in social media

నెమ్మదిగా ఆవు, పిల్లి వద్దకు వచ్చి గమనిస్తూ ఉండగా పిల్లి కూడా పలకరించినట్టుగా చూస్తుంది. ఆవు ఒకసారిగా ముందుకు రాగా పిల్లి, ఆవు దూడ ను ఒక్కసారిగా బెదిరించింది.బెదిరిపోయిన ఆవు వెనక్కి తిరిగి అవతలకి పల్టీ కొట్టడంతో ఒకసారిగా ఎగిరి కింద పడుతుంది. ఇలా జరిగిన ఈ వీడియో చూస్తుంటే ప్రేక్షకులు తెగ నవ్వుకుంటూ ఆవు దూడ పరిస్థితిని చూసి జాలి పడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ నెటిజన్లనులను ఆకర్షిస్తుంది.