Ram Charan : ఆర్ ఆర్ ఆర్ సినిమాలో దర్శక దిగ్గజం రాజమౌళి చేసిన వండర్ విజువల్ కు రికార్డుల మోత మోగుతూనే ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటన ప్రపంచస్థాయి లో గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మరియు ఓలివియో మూవీస్ మరియు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించడం జరిగింది. ఈ సంవత్సరం మార్చి 12న రిలీజ్ అయిన ఆర్ఆర్ మూవీ రికార్డు కలెక్షన్లతో ఒక ట్రెండు సెట్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి దాదాపు 1200 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. తరువాత ఓ టీ టీ లో రిలీజ్ అయ్యి ఇంకా రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. మే 20 నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ పలువురి ప్రశంసలు అందుకుంటూ దూసుకెళ్తుంది. ఈ సినిమా విజువల్ వండర్ గా ఉందంటూ ఈ సినిమాలో చేసిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటనకు పలువురు దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మార్వెల్స్ టీవీ సిరీస్ ల్యూక్ కేజ్ రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెయో హోదారి కోకర్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
Ram Charan : ప్రశంసలతో ముంచెత్తిన హాలీవుడ్ ప్రొడ్యూసర్….

రామ్ చరణ్ యాక్టింగ్ కి ఫిదా అయిన ఇతను ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్రలో ఆయన నటించిన విధానంకు తర్వాతి జేమ్స్ బాండ్ గా రాంచరణ్ సరిగ్గా సరిపోదు అంటూ పొగడ్తలతో ముంచేత్తారు. ఈయన పెట్టిన ట్వీట్ లో ఇలా ఉంది నెక్స్ట్ జేమ్స్ బాండ్ ఎవరూ అనగానే గ్యాంగ్స్ ఆఫ్ లండన్‌లో సోప్, ది ఆఫర్ సినిమాలో మాథ్యూ, స్నోఫాల్ మూవీ డ్యామ్‌సన్, ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ వెంటనే నా మైండ్ లో మెదిలారు ‘ అని తన మెసేజ్ లో రాయడం జరిగింది. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మెగా ఫ్యాన్స్ కి సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ఇది చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందంతో తమ హీరో గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.
Damn! That escalated quickly. Everyone knows Idris from, well, everything, but to get inside my thinking, watch Sope in “Gangs Of London,” Matthew G in “The Offer”, Damson in “Snowfall” and Ram in “RRR”. They all deserve a shot at a Savile Row suit and a Walther PPK. https://t.co/8ZGV4UFd9P
— Cheo Hodari Coker (@cheo_coker) July 27, 2022