Ravi Teja : మాస్ మహారాజా రవితేజ కొన్ని రోజుల క్రితం డౌన్ ఫాల్ అయినప్పటికీ, క్రాక్ అని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. దాని తర్వాత కిలాడీతో బాగానే క్రేజ్ అందుకున్నాడు. తరువాత వాల్తేరి వీరయ్య సినిమాలో లో చిరంజీవి సరసన ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అందరికీ తెలిసిన విషయమే… రవితేజ పలు సినిమాలతో బిజీగా మారాడు. ఆయన ప్రస్తుతం రామారావు అండ్ డ్యూటీ అనే మూవీ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం 29 జులై న అభిమానుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నది. అయితే ఈ మూవీ నుండి ఇప్పుడు ఒక 20 సెకండ్ల క్లిప్పు లీక్ అయింది. దాంతో కలకలం రేపుతుంది.
వాస్తవానికి టాలీవుడ్‌ను ఈ లీక్ గోల వదిలి పెట్టేలా లేదు. ఇలాంటివి చాలాసార్లు జరిగినట్లు తెలిసిన విషయమే.. సాంగ్స్ చిన్నచిన్న క్లిప్పులు కలకలం రేపాయి కొన్నిసార్లు.. అదేవిధంగా ఇప్పుడు ఈ మూవీ లో కూడా అలాగే జరిగింది. ఇక లీకైన చిన్న క్లిప్ లో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ..పలు రాజకీయ నాయకులు కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా ఆసక్తికరంగా విలపిస్తుంది. అయితే దీనిలో డైలాగ్ ఒరేయ్ మీరు ఎవరో, ఏ పార్టీయో కానీ ,ఎవరైనా అధికారంలో ఉన్నాము కదా… అని కొండలు తీసేస్తాం ,చెరువులు పూడ్చి వేస్తాం, భూములను కొట్టేస్తాం, అని దందాకు దిగారు అనుకో ఒక్కొక్కటి తాట తీస్తా…. రేయ్ అని అంటూ ఉంటాడు రవితేజ.. అని ఈ క్లిప్ లో ఉన్నది.
Ravi Teja : రామారావు ఆన్ డ్యూటీ లీకైన వీడియో

అయితే ఈ మూవీలో రవితేజ కలెక్టర్ రోల్ లో పోషిస్తున్నారు. ఈ మూవీను శ్రీ లక్ష్మీ బ్యానర్ పైన, సుధాకర్ చెరుకూరి, అదేవిధంగా రవితేజ టీం వర్క్ ,బ్యానర్ పై రవితేజ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్లిప్ ఎడిటింగ్ రూమ్ నుండి బయటికి వచ్చినట్లు సమాచారం వచ్చింది. ఎందుకనగా ఈ క్లిప్ లో లాస్ట్ లో ఎడిటింగ్ సిస్టం కూడా కనిపిస్తుంది. అందుకే ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అయిఉండవచ్చు… అని అంటున్నారు పలువురు..