Chiranjeevi : చిరంజీవిని ఏడిపించిన రామ్ చరణ్… ఆ మాటతో ఎమోషనల్ అయినా మెగాస్టార్…

Chiranjeevi :మెగాస్టార్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి మెగా పవర్ స్టార్ బిరుదును దక్కించుకున్నాడు రామ్ చరణ్ తేజ్. తనదైన నటనతో క్లాస్ మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తూ సూపర్ డూపర్ హిట్స్ను ఖాతాలో వేసుకున్నారు రామ్ చరణ్. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా అయిపోయాడు. అయితే నటుడిగా రామ్ చరణ్ కెరీర్ మొదలై 15 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.

Advertisement

ఓ నటుడిగా చిరుత నుంచి మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తాజాగా RC15 వరకు తనని తాను మార్చుకుంటూ రామ్ చరణ్ ఎదిగిన తీరు ఎంతో బాగుందని చెప్పిన చిరంజీవి చెర్రీ వర్క్ డెడికేషన్ అన్ని చూస్తుంటే సంతోషంగా ఉంది అన్నారు. ఫ్యూచర్లో చరణ్ ఉన్నత శిఖరాలు అందుకోవాలని తన కొడుకు గురించి తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు. నీకోసం ఎదురుచూసే మరెన్నో గొప్ప ఘనతలు ఉన్నాయి. వాటి వైపు వెళ్ళు నీదే విజయం అని చిరంజీవి అన్నారు.

Advertisement

Chiranjeevi : చిరంజీవిని ఏడిపించిన రామ్ చరణ్…

Chiranjeevi emotional words about Ram charan
Chiranjeevi emotional words about Ram charan

ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. RC15 అనే టైటిల్ తో తిరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ ను నింపుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారిగా త్రీపాత్రాభినయం చేయబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా 50వది కావడంతో దిల్ రాజు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇందులో హీరోయిన్ గా కియార అద్వానీ నటిస్తుంది.

Advertisement