Chiyan Vikram : తమిళ అగ్రహీరోల లో ఒకరు అయినటువంటి చియాన్ విక్రమ్ కొద్దిసేపటి క్రితమే హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో చికిత్స పొదుతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం విక్రమ్ పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియదు. కార్డియాక్ అరెస్ట్ తో హాస్పిటల్ లో చేరడంతో తన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.అభిమానులు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ కు వచ్చి తమ హీరో గురించి ఆరా తీస్తున్నారు.
విక్రమ్ ఇప్పుడు చాలా ప్రాజెక్టు షూటింగ్ దశలో ఉన్నాయి. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ అగ్ర హీరోగా ఎదిగి నటనలో తన సత్తా చాటాడు విక్రమ్. శివ పుత్రుడు సినిమాలో తన విలక్షణ పాత్రలో నటించి జాతీయ స్థాయిలో తన నటనకు గాను అవార్డు తీసుకున్నాడు. విక్రమ్ అపరిచితుడు అనే సినిమాలో తన నటనకు తమిళ, తెలుగు భాషల్లో తిరుగులేని హీరోగా తన సత్తా చాటటం జరిగింది.

విక్రమ్ కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మణిరత్నం డైరెక్షన్లో నిర్మిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలు నటిస్తున్నాను. ఇప్పుడు తనకు వచ్చిన గుండెపోటుతో అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన ఆరోగ్యంపై ఆరా తీస్తూ విక్రమ్ త్వరగా కోలుకోవాలని క్షేమంగా తిరిగి రావాలని తన ఫ్యాన్స్ దేవుని కోరుకుంటున్నాను.