Pushpa2 : అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇండియాను ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన, సమంత, ఫాహద్ ఫాసిల్ కలిసి సినిమా ను హైలెట్ చేశారు. ఈ సినిమాలో బన్నీ డ్రెస్సింగ్ స్టైల్, భాష, డైలాగులు చెప్పే తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్ లో కూడా పుష్ప సినిమా రిలీజ్ అయింది. టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే పుష్ప సినిమా ప్రభావం ఎక్కువగా కనిపించింది. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి తెరపైకి వస్తుందా అని ఆత్రుతగా చూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం పుష్ప-2 సినిమా ఆగస్టు మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. నిజానికి ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జూలై నెలలో ప్రారంభం కావాల్సింది కానీ పుష్ప సినిమా హిట్ అయ్యాక ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా కేజీఎఫ్ – 2 సినిమా తో అభిమానులు ఊగిపోయారు. ఈ కారణంగా పుష్ప-2 సినిమాపై అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకే పుష్ప మేకర్స్ సినిమా స్క్రిప్ట్ ను మార్చినట్లుగా ప్రచారం జరిగింది. అందుకే డైరెక్టర్ సుకుమార్ ఆగస్టు వరకు మూవీ షూటింగ్ ను వాయిదా వేశాడని సమాచారం.
Pushpa2 : పుష్ప ది రూల్ చిత్రీకరణ పై క్లారిటీ
అయితే ఇప్పుడు సుకుమార్ పుష్ప – 2 సినిమా స్క్రిప్ట్ ను దాదాపు పూర్తి చేశాడు. అల్లు అర్జున్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి చాలా మార్పులు చేశాడు. సినిమా జనవరి 2023లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన కాకుండా మరో బ్యూటీని తీసుకుంటున్నట్లు సమాచారం. మరికొందరు రష్మిక మందన హీరోయిన్ గా కొనసాగుతుందని అంటున్నారు. ఫాహద్ ఫాసిల్ సోదరిగా మరో హీరోయిన్ కనిపించనిందని టాక్ వస్తుంది. అలాగే ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కూడా పుష్ప-2 సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే విజయ్ సేతుపతి తో పాటు మరొక విలన్ కూడా పుష్ప-2 సినిమాలో నటించనున్నట్లు సమాచారం.