Viral Video : అసలే వర్షాకాలం. బయటికెళ్తే ఎక్కడ ఏ పాము, తేలు కాటేస్తాయో అని తెగ భయపడుతున్నారు జనాలు. అయితే.. పాములు, తేళ్లతో బయటనే మనకు ప్రమాదం అనుకుంటే తప్పు. ఎందుకంటే.. పాములు, తేళ్లు, ఇతర పురుగులతో ఇంట్లోనూ మనకు ప్రమాదం పొంచి ఉంది. వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాలకు భూమి లోపల పడుకున్న పాములు, తేళ్లు అన్నీ ఇప్పుడు బయటికి వచ్చి వాటికి ఎక్కడా చోటు దొరక్కపోతే.. నేరుగా ఇళ్లలోకి దూరుతాయి. ఇళ్లలో ఎక్కడో ఒక చోట దూరి పడుకుంటాయి.

అవి ఎక్కడో ఒక చోట దూరితే వాటిని ఎలాగోలా పసిగట్టి వాటిని బయటికి పంపించేయొచ్చు కానీ.. అవి చెప్పులు, షూలలో దూరితే అప్పుడు ఏంటి పరిస్థితి. చూడకుండా షూ వేసుకుంటే ఇంకేమైనా ఉందా. పాములకు బలి కావాల్సిందే. ఇప్పటికే అలా.. షూలు, చెప్పులలో దూరిన పాములకు సంబంధించిన ఎన్నో ఘటనలు ఇప్పటి వరకు చూశాం.
Viral Video : షూలో ఉన్న పామును చూసి నెటిజన్లు షాక్
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఏకంగా ఓ నాగుపాము షూలో దూరింది. షూలో పాము దూరిన సంగతి తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. షూలో ఉన్న నాగుపామును వెలికి తీశారు.
షూలో కర్రతో చెక్ చేయగానే.. నాగుపాము ఒక్కసారిగా పడగ విప్పి పైకి లేచింది. బుసలు కొట్టింది. ఒకవేళ చూడకుండా షూలో కాలు పెడితే ఇంకేమైనా ఉందా? పాము కాటుకు బలి కావాల్సిందే కదా. వెంటనే రెస్క్యూ టీమ్ ఆ పామును షూలో నుంచి తీసి అక్కడి నుంచి తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.
You will find them at oddest possible places in https://t.co/2dzONDgCTj careful. Take help of trained personnel.
WA fwd. pic.twitter.com/AnV9tCZoKS— Susanta Nanda IFS (@susantananda3) July 11, 2022
ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వామ్మో షూలలో కూడా పాములు ఉంటాయా? ఇప్పటి నుంచి షూను జాగ్రత్తగా చెక్ చేసుకొని వేసుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.