Conductor Jhansi : ఈటీవీలలో బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఒక లేడీ కండక్టర్ స్టేజి పై డాన్స్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె ఆ స్టేజి పైన డాన్స్ తో ఎంతో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు హాట్ గా తయారైంది. పల్సర్ బండి మీద రా అంటూ సోషల్ మీడియాని హల్చల్ చేస్తుంది. ఈ అమ్మడు లేటెస్ట్ ఎమోషనల్ వీడియో తెగ హాట్ టాపిక్ గా మారింది గత కొన్ని రోజులుగా పల్సర్ బండి అనే పాట ఒక అమ్మాయి చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియా హల్చల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
Conductor Jhansi : దయచేసి అలా చేయకండి ప్లీజ్..
ఈ అమ్మడు ఆమె పేరుతోనే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చేసిన డాన్స్ అంతా ఇంతా కాదు. ఆ సాంగ్ కు ఆమె వేసిన డాన్స్ స్టెప్పులు చూసి అందరూ అవాక్కయ్యారు. అలాగే స్టార్ట్ సైతం ఆ అమ్మలు మంచి టాలెంట్ ని గురించి ఒక స్టైల్ లో ఆమెని అందలానికి ఎక్కించారు. ఈ అమ్మడు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన డ్యాన్స్ పై పలువురు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఆమె భర్తని కూడా దాన్లోకి లాగుతూ తనని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ అమ్మడు ఎమోషనల్ గా ఉన్న వీడియో ను సోషల్ మీడియాలో పెట్టింది. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో కండక్టర్ ఝాన్సీ మాట్లాడుతూ.. నాకు మంచి ఛాన్స్ వచ్చిందని నాలో ఉన్న డాన్స్ ని బయట పెట్టడానికి ఆ ప్రోగ్రాం కి వెళ్ళాను డాన్స్ చేశాను. అందరూ నన్ను పొగిడారు థ్యాంక్స్.. కానీ పలువురు మాత్రం మా వారిని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అలా చేయకండి. నా డాన్స్ చూసి మా వారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. దానిని మీరు చెడగొట్టకండి. బూతులు కామెంట్స్ పెడుతున్నారు ప్లీజ్ అలా చేయకండి నా భర్తని టార్గెట్ చేయడం ఆపండి. ఇకపై ఇలాంటివి పెట్టరు .అని నేను అనుకుంటున్నాను.. అంటూ ఎమోషనల్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.