Viral Video : ఒకేసారి మూడు త్రాచు పాములతో ఆటలాడాడు… తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్ అవుతారు….

Viral Video : పాములతోనే ఎంతటి వారైనా సరే అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ఇంకా నాగుపాములైతే చాలా ప్రాణాంతకమైనవిగా చెప్పవచ్చు. అయితే కొందరు కొందరు వ్యక్తులు చాకచక్యంగా పాములను పడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ పాములని హేండిల్ చేసే సమయంలో కొంతమంది పాము కాటుకు గురై ప్రమాదంలో పడ్డారు. ఇంకా కొందరు వ్యక్తులు తమకు తెలియకుండానే పాముల కాటుకి బలి అవుతూ ఉంటారు. ఇటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఒక వ్యక్తి ఒకేసారి మూడు పాములను ఆడించడానికి ప్రయత్నించి ఎవరు ఊహించని విధంగా ఒక పాము కాటుకు గురైన సంఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

Viral Video : ఒకేసారి మూడు త్రాచు పాములతో ఆటలాడాడు…

ఈ వీడియోలో ఎలా ఉందంటే ఒక వ్యక్తి మూడు పాములను ఒకేసారి ఆడించడానికి ప్రయత్నిస్తున్నాడు. ముందుగా పాములను పట్టుకునే సాధనంతో మొదటి పామును తోకను కదిలిస్తూ, తరువాత తన చేతితో పామును తోకపై తాకాడు. తర్వాత తన చేతులతో మోకాళ్ళతో సౌజ్ఞలు చేస్తుండగా మూడో పాము అతను ఊహించని విధంగా అతని మోకాలుపై కాటు వేయడం జరిగింది. ఇది అతని ఊహించని పరిణామం కావడంతో ఒక్కసారిగా లేచి ఆ పాముని వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. ఎంత నిపుణులైనప్పటికీ పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అని విషయం ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది.

Advertisement
man playing with three cobras gone wrong viral video
man playing with three cobras gone wrong viral video

ఈ వీడియోలో ఐఎఫ్ఎస్సి సుశాంత నంద అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోని షేర్ చేయడం జరిగింది. త్రాచు పాములను పట్టుకోవడం అనేది ఒక భయంకరమైన విషయం అని ఇది మన ప్రాణాల మీదికే తెస్తుంది అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియో షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతూ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ అనేకమంది నటిజనులు పాములతోనే చెలగాటం వద్దు అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసి పాములతో ఏ విధంగా జాగ్రత్త ఉండాలో తెలుసుకోండి.

Advertisement