Cristiano Ronaldo : ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో జీవితం లోని కష్టాలు, తన గొప్పతనం మీలో ఎంతమందికి తెలుసు

Cristiano Ronaldo : క్రిస్టియానో రోనాల్డో పోర్చుగల్ లోని 1985-02-05 న జన్మించాడు. రోనాల్డో వాళ్ల అమ్మగారు ఇళ్లలో పనిమనిషిగా పనిచేసేవారు. నాన్నగారు కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ, పార్ట్ టైమ్ లో ఫుట్‌బాల్ స్టేడియంలో కిట్ మ్యాన్ గా పనిచేసేవాడు. అంటే అక్కడ ఫుట్ బాల్ ప్లేయర్స్ కి వారి కిట్స్ ని అందించటం, అలాగే వాళ్ల రూమ్స్ ని క్లీన్ చేస్తూ ఉండేవాడు. రోనాల్డో వాళ్ళ నాన్నగారు పేదరికంతో కుటుంబాన్ని సరిగ్గా పోషించే శక్తి లేదని తనను తాను కుమిలిపోతూ, మద్యపానానికి బానిస అయ్యారు కానీ ఇంత త్రాగిన, ఏమీ సాధించలేకపోయిన రోనాల్డోను మాత్రం బాగా చూసుకునేవాడు. రోనాల్డో కి వాళ్ళ నాన్నగారు చిన్నతనంలోనే ఫుట్‌బాల్ ని పరిచయం చేశాడు.

Advertisement

అప్పటి నుండి చిన్న చిన్నగా ఆడటం మొదలుపెట్టాడు. అతడు చిన్న వయసులో ఫుట్ బాల్ ని కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న గుడ్డ ముక్కలతో ఒక ఫుట్‌బాల్ తయారుచేసుకొని వాళ్ళ వీధుల్లో ఆడుతూ ఉండేవాడు, ఆడుకోవడానికి సరైన బూట్లు లేకపోవడంతో వాళ్ల బంధువులు పడేసిన బూట్లను తీసుకొని వాటిని వాడుకునేవాడు. ఒక్క పూట వాళ్ల తల్లిదండ్రులు కష్టపడకపోతే ఎంతో కష్టంగా ఉండేది వాళ్ళ జీవితం,కానీ రోనాల్డో ఎప్పుడు బాధపడేవాడు కాదు, ఏదో సాధించాలి అనే తపనతో ఎప్పుడూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత రోనాల్డో వాళ్ళ నాన్నగారు పనిచేసే చోట అండోరిన్ అనే ఫుట్‌బాల్ క్లబ్ లో ఆయన కూడా పనిచేయడం మొదలుపెట్టాడు.

Advertisement

Cristiano Ronaldo : క్రిస్టియానో రొనాల్డో గొప్పతనం మీలో ఎంతమందికి తెలుసు

Cristiano Ronaldo Biography who played football
Cristiano Ronaldo Biography who played football

కానీ వాళ్ళ నాన్నగారు కిట్ మ్యాన్ గా పనిచేసి ప్లేయర్స్ కిట్స్ ని అందించడం చూసి మిగతా వాళ్లు ఎగతాళి చేసే వాళ్లు. దీని తర్వాత రోనాల్డోకి పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు స్పోర్టింగ్ సిసి క్లబ్ లో చేరడం కోసం తన స్కూల్ నుంచి తీసివేశారు చిన్నతనంలోనే తన తల్లిదండ్రులకు దూరంగా ఉండవలసి వచ్చింది, ఇక్కడ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. స్పోర్టింగ్ టీమ్ లో ఉన్నప్పుడు ఒకరోజు టీచర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అసభ్యంగా మాట్లాడేసరికి రోనాల్డో కి కోపం వచ్చి అందరూ చూస్తూ ఉండగానే టీచర్ మీదికి చైర్ ని విసిరివేసాడు. దానితో రోనాల్డో ను స్కూల్ నుంచి తీసేసారు. అప్పటినుంచి రోనాల్డో కి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది.

బాధను దిగమింగుకొని అవమానించిన వాళ్లకు గేమ్ తోనే సమాధానం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. వాళ్ళ కుటుంబం కూడా ఒప్పుకోవడంతో గేమ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టే వాడు రోనాల్డో ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడు ఒక రోజు అకస్మాత్తుగా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. 17 వ సంవత్సరంలో హార్ట్ ఆపరేషన్ జరిగింది దాని తర్వాత మైదానంలో అడుగు పెట్టి మళ్ళి ప్రాక్టీస్ చేశాడు. 2003 వ సంవత్సరంలో ఫుట్‌బాల్ స్టేడియంలో ఆడుతున్నప్పుడు మాంచెస్టర్ యునైటెడ్ టీమ్ వాళ్ళు తను గేమ్ ఆడే విధానాన్ని గమనించి కొన్ని కోట్లు ఇచ్చి రోనాల్డో ను తమ టీమ్ లోకి చేర్చుకున్నారు. ఆ క్షణం నుంచి రోనాల్డో పేరు మారుమ్రోగింది.

తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 2017 వ సంవత్సరంలో తన తండ్రి లివర్ డ్యామేజ్ తో చనిపోయాడు అదే రోజు పోర్చుగల్ వర్సెస్ రష్యా ఫుట్‌బాల్ నడుస్తుంది అయినా సరే తన బాధను తనలోనే దాచుకొని కసితో తన ఆటను ఆడాడు, ఆ మ్యాచ్ విన్ అయ్యాడు. దానితో పాటు ఆ మ్యాచ్ లొ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని కూడా గెలుచుకున్నాడు. రోనాల్డో గాలిలోకి డెబ్బై అయిదు సెంటీ మీటర్లు జంప్ చెయ్యగలడు. అంటే బాస్కెట్బాల్లో క్లియర్ చేసే దానికంటే ఎక్కువ రోనాల్డో కాళ్ళకి ఒక్కసారి బాల్ దొరికింది అంటే ఇక అంతే గోల్స్ పడాల్సిందే, ఏ కాలుతో అయినా గోల్ కొట్టగలడు. అతడు తలతో గోల్స్ కొట్టడంలో దిట్ట. అంటే ఇప్పటివరకు వందకు పైగా గోల్స్ తను కొట్టినవే అంతేకాదు హిస్టరీ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్టెస్ట్ ఫుట్ బాల్ ప్లేయర్ గా రికార్డు ఉంది.

రోనాల్డో సుమారు గంటకు 33.6 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలడు అందుకే అంత వేగంగా ఫుట్‌బాల్ గేమ్ ఆడగలడు. అందుకే ఆయనని రాకెట్ మ్యాన్ అని కూడా అంటారు. ఇక ట్రోఫీల విషయానికి వస్తే చాలానే ఉన్నాయి. ఫుడ్ బాల్ ఆఫ్ ది ఇయర్, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఇలా చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా కోట్లలో అభిమానులు ఉన్నారు. ఫేస్‌బుక్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ గా రికార్డు సాధించాడు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో 399 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. రోనాల్డో గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్ మాత్రమే కాదు మంచి మనిషి కూడా. 2009 నుంచి ఇప్పటివరకు కొన్ని కోట్లు విరాళంగా ఇచ్చాడు. పేదరికం నుంచి వచ్చి చిన్నతనంలోనే ఇంత సక్సెస్ సాధించిన ఘనత రోనాల్డో కి మాత్రమే దక్కుతుంది

Advertisement